Share News

BRS: బంగారు తెలంగాణ నుంచి బెదిరింపుల వరకు.. హన్మంతరావు వ్యాఖ్యలపై ఆర్ఎస్ ప్రవీణ్ మండిపాటు

ABN , Publish Date - Oct 07 , 2024 | 03:11 PM

మాజీ సీఎం కేసీఆర్(KCR) పాలనలో బంగారు తెలంగాణనను స్వప్నించిన ప్రజలు నేడు బెదిరింపుల తెలంగాణను చూస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar)అన్నారు.

BRS: బంగారు తెలంగాణ నుంచి బెదిరింపుల వరకు.. హన్మంతరావు వ్యాఖ్యలపై ఆర్ఎస్ ప్రవీణ్ మండిపాటు

హైదరాబాద్: మాజీ సీఎం కేసీఆర్(KCR) పాలనలో బంగారు తెలంగాణనను స్వప్నించిన ప్రజలు నేడు బెదిరింపుల తెలంగాణను చూస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar)అన్నారు. కాంగ్రెస్ పాలనలో బెదిరింపుల రాజ్యం నడుస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్ రావులనుద్దేశించి కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియోను ఆయన ఎక్స్‌లో షేర్ చేశారు.


ప్రతి మాటా నేరం..

"మైనంపల్లి హన్మంతరావు(Mainampally Hanmantha Rao) బెదిరింపుల భాష వినండి. కేటీఆర్, హరీష్ రావు గార్ల మీద పెట్రోలు పోసి ఈయన మీద కూడా పోయాలంట . పక్కా ప్లాను వేస్తరట..జైలుకు కూడా పోతారట. @TelanganaDGP.. హన్మంతరావు బహిరంగంగా మాట్లాడిన ప్రతి మాటా నేరం. ఇవన్నీ వారు బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు! నిజానికి దీని మీద పోలీసులు సుమోటో కేసు నమోదుచేసి దర్యాప్తు చేయాలి. ఆయన వ్యాఖ్యలపై అక్టోబర్3 నే గజ్వేల్, సిద్దిపేట పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశాం. పోలీసుల నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదు. స్థానిక ఉన్నతాధికారులతో మాట్లాడితే న్యాయ సలహా తీసుకుంటామని అంటున్నారు. నాకొక అనుమానం. సామాన్య పౌరుడు ఇలానే మాట్లాడితే వెంటనే కేసులు బుక్ చేయరా? మొన్న హైడ్రా బాధితులు కడుపుకాలి సీఎం రేవంత్ రెడ్డిపై శాపనార్థాలు పెడితే న్యాయ సలహా తీసుకొనే కేసులు పెట్టారా? రాత్రికి రాత్రి టాస్క్స్ ఫోర్స్ వచ్చి అక్రమంగా వాళ్లను ఖాళీ చేయించారు కదా. కళ్ల ముందే నేరం జరిగినా అన్నింటికీ న్యాయ సలహా తీసుకుంటే మరి మనకు ఎందుకు అకాడమీల్లో ట్రైనింగు, సెక్షన్ 154(1) Cr PC కింద విస్తృతమైన అధికారాలు, పోలీసు వాహనాలు, యూనిఫాం?"అని ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి...

KTR: మూసీ ఆర్భాటం ఎవరి కోసం.. కేటీఆర్ సూటి ప్రశ్న

Viral: భారతీయులకే జాబ్స్ ఇస్తున్నారు.. కెనడా శ్వేతజాతీయురాలి సంచలన ఆరోపణ

Bathukamma: ఆరోరోజు అలిగిన బతుకమ్మ... ఎందుకు అలిగిందో తెలుసా

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 07 , 2024 | 03:14 PM