RS Praveen Kumar: ఒక్కసారి మాటిస్తే మడమ తిప్పకుండా ఉంటా.. ఆ రెండు ఒక్కటైతేనే..
ABN , Publish Date - Mar 18 , 2024 | 09:23 PM
తాను ఒక్కసారి మాటిస్తే మడమ తిప్పకుండా ఉంటానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) అన్నారు. సోమవారం మాజీ సీఎం కేసీఆర్ (KCR) సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి (BRS Party) చేరిన తర్వాత ఆయన మాట్లాడుతూ.. రెండున్నర సంవత్సరాలుగా బీఎస్పీ పార్టీలో 50 వేల కిలోమీటర్ల వరకు యాత్ర చేసి, బహుజనులను చైతన్యపరిచామని చెప్పారు.
తాను ఒక్కసారి మాటిస్తే మడమ తిప్పకుండా ఉంటానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) అన్నారు. సోమవారం మాజీ సీఎం కేసీఆర్ (KCR) సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి (BRS Party) చేరిన తర్వాత ఆయన మాట్లాడుతూ.. రెండున్నర సంవత్సరాలుగా బీఎస్పీ పార్టీలో 50 వేల కిలోమీటర్ల వరకు యాత్ర చేసి, బహుజనులను చైతన్యపరిచామని చెప్పారు. బహుజనవాదం, తెలంగాణవాదం రెండూ ఒకటేనని.. ఈ రెండూ అణచివేతకు గురయ్యానని చెప్పారు. ఈ రెండు ఒక్కటైతేనే.. తెలంగాణ రాష్ట్రం మరింత బలపడుతుందని తెలిపారు. తాను నిజంగానే అమ్ముడుపోతే.. అధికార పార్టీలో ఉండేవాడినని తనపై వస్తున్న విమర్శల్ని తిప్పికొట్టారు. సోషల్ మీడియాలో వచ్చే దుష్ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయదుందుభి మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
పరిస్థితులకు అనుగుణంగా కొత్త దారిని వెతుక్కోవాల్సి వచ్చిందని వివరించిన ప్రవీణ్‌కుమార్.. తన నాయకత్వంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా బీఎస్పీ (BSP) ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే తాను బీఆర్ఎస్‌లోకి చేరానన్నారు. తాను ప్యాకేజీల కోసం కాదు, ప్రజాసేవ కోసమే ఈ పార్టీలోకి చేరడం జరిగిందని స్పష్టం చేశారు. ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ముందుకు సాగాల్సిందేనని.. ఇదే తాను నమ్మిన ధర్మమని చెప్పుకొచ్చారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం గత పదేళ్లలో స్వర్ణయుగాన్ని చూసిందని.. ఇప్పుడు కేసీఆర్ అధికారంలో లేకపోయినా ప్రజల గుండెల్లో ఉన్నారని చెప్పారు. బహుజన వాదం అంటే స్వార్థపరులు ఉండేది కాదన్న ఆయన.. తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని నిర్ణయించుకొని వచ్చామని తెలిపారు. తన గుండెల్లో ఇప్పటికీ బహుజన వాదం ఉందని పేర్కొన్నారు.
ఇదే సమయంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రవీణ్‌కుమార్ బీఆర్ఎస్‌లో చేరడం, తెలంగాణ ప్రస్థానంలో ఓ కీలకమైన మార్పు అని అన్నారు. తెలంగాణ వాదం అంటే ఈ ప్రాంత ప్రజల పీడిత బాధ అని కేసీఆర్ ఆనాడే చెప్పారన్నారు. బహుజన వాదం, తెలంగాణ వాదం ఒకటేనని ప్రజల్లో తీసుకెళ్లాలన్నారు. వంద రోజుల్లోనే ప్రజలు తప్పు చేశామని అనుకుంటున్నారన్నారు. కొన్ని ఆంధ్ర మీడియా శక్తులు తెలంగాణ వాదానికి అడ్డుపడుతున్నాయని ఆరోపించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి