Share News

Telangana News: సదాశివపేట మున్సిపల్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాస నోటీసులు

ABN , Publish Date - Jan 18 , 2024 | 04:26 PM

సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపల్ చైర్‌పర్సన్ పీ.జయమ్మ (బీఆర్ఎస్ పార్టీ)పై అవిశ్వాసం పెట్టాలని కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్‌కు నోటీసులు ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మొత్తం 26 మంది కౌన్సిలర్లలో 24 మంది ఈ అవిశ్వాసానికి మద్దతు తెలిపారు.

Telangana News: సదాశివపేట మున్సిపల్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాస నోటీసులు

సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపల్ చైర్‌పర్సన్ పీ.జయమ్మ (బీఆర్ఎస్ పార్టీ)పై అవిశ్వాసం పెట్టాలని కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్‌కు నోటీసులు ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మొత్తం 26 మంది కౌన్సిలర్లలో 24 మంది ఈ అవిశ్వాసానికి మద్దతు తెలిపారు. కౌన్సిలర్‌గా కొనసాగుతున్న జయమ్మ కుమారుడి తీరుపై విసుగెత్తి.. కౌన్సిలర్లు ఈ అవిశ్వాసం పెట్టారని తెలిసింది. ఈ నేపథ్యంలోనే.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, బల్దియాపై కాంగ్రెస్‌ జెండా ఎగరేయాలనే అధికార పార్టీ భావిస్తోంది. ఇప్పటికే ఆ దిశగా పావులు కదుపుతోందని సమాచారం.


మరోవైపు.. ఇటీవల బీజేపీ నుంచి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న ఓ కౌన్సిలర్ భర్త.. తన భార్యను బల్దియా పీఠంపై కూర్చోబెట్టాలని అనుకుంటున్నట్టు వార్తలొస్తున్నాయి. ఆ ఉద్దేశంతోనే ఆయన అసంతృప్త కౌన్సిలర్లతో కొన్నిసార్లు మంతనాలు జరిపి.. తనవైపుకు తిప్పుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. మరికొందరు కౌన్సిలర్లు కూడా.. ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా.. గతేడాది ప్రారంభం నుంచే సదాశివపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కౌన్సిలర్ల అసమ్మతి రాగం ఊపందుకుంది. మున్సిపల్ చైర్‌పర్సన్‌ను ఎలాగైనా గద్దె దింపాలన్న ఉద్దేశంతో అసంతృప్తి కౌన్సిలర్లు తమ ప్రయత్నాల్ని మొదలుపెట్టారు.

Updated Date - Jan 18 , 2024 | 04:26 PM