Telangana : అగ్రి డాక్టర్స్ అధ్యక్షుడిగా సాల్మన్ నాయక్
ABN , Publish Date - May 27 , 2024 | 03:19 AM
తెలంగాణ అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా బి. సాల్మన్ నాయక్ ఎన్నికయ్యారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండల వ్యవసాయశాఖ అధికారిగా పనిచేస్తున్న సాల్మన్ నాయక్‌ను..
హైదరాబాద్, మే 26 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా బి. సాల్మన్ నాయక్ ఎన్నికయ్యారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండల వ్యవసాయశాఖ అధికారిగా పనిచేస్తున్న సాల్మన్ నాయక్‌ను.. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన కేంద్ర కార్యవర్గ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తిరుపతి నాయక్, కోశాధికారిగా మధుమోహన్, సహాధ్యక్షులుగా నిశాంత్ కుమార్, భాస్కర్, ఉపాధ్యక్షులుగా కిషోర్‌బాబు, లింగస్వామి, రామారావు, సంయుక్త కార్యదర్శిగా నాగరాజు, సాంస్కృతిక కార్యదర్శులుగా ఏడీఏ శివానంద్, రాధిక, ఉష, మహిళా కార్యదర్శులుగా నీలిమ, రత్న, సంధ్యలు ఎన్నికయ్యారు.
కొత్త కార్యవర్గం ఎన్నిక అనంతరం వ్యవసాయశాఖలో నెలకొన్న సమస్యలు, బదిలీలు, పదోన్నతులపై చర్చించారు. ఈ సందర్భంగా పదోన్నతుల ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వానికి అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు కె. రాములు విజ్ఞప్తి చేశారు. సుదీర్ఘ కాలంగా వ్యవసాయ శాఖ అధికారులు బదిలీల కోసం ఎదురుచూస్తున్నారని, నియామకాలకు ముందే బదిలీలు చేపట్టాలని ఆయన కోరారు.