Share News

నాటి సందులూరే.. నేటి చండూరు

ABN , Publish Date - Dec 24 , 2024 | 12:57 AM

నల్లగొండ జిల్లా చండూరులో చండీమాత ఆలయం (కనకదుర్గ దేవాల యం) వద్ద అయితే 300 ఏళ్ల క్రితమే అయుత చండీయాగం నిర్వహించినట్లు చరిత్రకారు లు పేర్కొంటున్నారు.

 నాటి సందులూరే.. నేటి చండూరు
పురాతన కనకదుర్గ దేవాలయం

నాటి సందులూరే.. నేటి చండూరు

చండూరులోనే తొలి అయుత చండీయాగం

300ఏళ్ల క్రితం నిర్వహణ

చండీయాగంతో చండూరుగా నామకరణ

చండూరు, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా చండూరులో చండీమాత ఆలయం (కనకదుర్గ దేవాల యం) వద్ద అయితే 300 ఏళ్ల క్రితమే అయుత చండీయాగం నిర్వహించినట్లు చరిత్రకారు లు పేర్కొంటున్నారు. ఇక్కడ చండీమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించినప్పుడు వారం రోజుల పాటు ఈ యాగం నిర్వహించినట్లు పురోహితులు తెలిపారు. చండీయాగం నిర్వహించడం వల్లే గ్రామానికి చేండూరుగా పేరుగా మారిందని, అది రూపాంతరం చెంది చెందూరుగా తర్వాత చండూరుగా స్థిరపడిందని పట్టణానికి చెందిన పంచాంగకర్త చిరువెళ్లి హరికిషనశర్మ తెలిపారు. యాగం విషయంపై తన తండ్రి ఎప్పుడూ వివరించేవారని తెలిపారు. అంతేకాక ప్రాచీన కాలం నుంచే హోమాలకు చండూరు ప్రసిద్ధి గాంచిందని పేర్కొన్నారు. చండీయాగం స్ఫూర్తి తోనే 60 ఏళ్ల క్రితమే గురువు ఇంటింటికి భిక్షాటన చేసి నిధులు, బియ్యాన్ని సమకూర్చినట్లు పూర్వీకులు చెప్పేవారని స్థానిక వ్యాపారవేత్త సముద్రాల వెంకన్న తెలిపారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎర్రవెళ్లిలో డిసెంబరు 23 నుంచి 27 వరకు నిర్వహించిన అయుత చండీయాగం దేశంలోనే రెండోవదని చరిత్రకారుల, పండితులు చెబుతున్నారు.

చండూరు ఎలా వచ్చిందంటే...

ఒకప్పుడు చండూరుకు తూర్పున ఉన్న ఊరు బ్రాహ్మణగూడెం. పడమట ఉన్న ఊరు సీతారాంపురం. ఈ సమయంలో సందులు అధికంగా ఉన్న చోట సదానందస్వామి దేవాలయం (శివాలయం) వెలిసింది. బ్రాహ్మణగూడెం, సీతారాంపురం రెండు ఊర్లు ఈ దేవాలయం పరిధిలోనే కలిసిపోయాయి. దేవాలయం చుట్టూ సందులు అధికంగా ఉండడంతో మొదటగా సందులూరుగా పేరుగాంచింది. రానురానుగా సందూరుగా.. చందూరుగా.. చండూరుగా పేరుగా మారింది. పట్టణంలో నాడు అధికంగా సందులు ఉండటం వల్ల పెద్దగా పట్టణంలోకి ఒకటి, రెండుమార్లు ఇంటికి వెళ్లి చూసి, మరోమారు గుర్తు పట్టడం కష్టం. పట్టణంలో ఆ స్థాయిలో సందులు ఉండేవి.

చండీయాగంలో రుత్వికుడిగా చండూరువాసి

మెదక్‌ జిల్లా ఎర్రవెల్లిలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ని ర్వహించిన అయుత చండీయాగంలో ప్రధాన హోమం గుం డం వద్ద చండూరు పట్టణానికి చెందిన రువెళ్లి అజయ్‌శర్మ విధులు నిర్వహించాడు. ఎలాంటి ఆటంకాలు కలగకుండా సప్తశథ పారాయణం, హోమం, జపం, తత్వం కార్యక్రమాలు నిర్వహించే వారిని రుత్వికులు అంటారు. హోమం యాజమా ని నాటి సీఎం కేసీఆర్‌ కాగా ఆయన తరపున కార్యక్రమాల ను నిరాటంకంగా నిర్వహించిన రుత్వికుల్లో ఒకరు రువెళ్లి అజయ్‌శర్మ. ఇంజనీరింగ్‌లో అవకాశం వచ్చినా, తన తాత పం చాంగకర్త చిరువెళ్లి శ్యాంసుందరశర్మ అడుగు జాడల్లో నడవాలని నిర్ణయించుకున్నాడు. గజ్వేల్‌ స మీపంలోని వర్గల్‌ ప్రాంతంలోని సరస్వతి, శనేశ్వర ఆలయ సమీపంలో ఉన్న శారద స్మార్త వైదిక పాఠశాల లో ఉప్పల అనంతగిరిస్వామి వద్ద శి ష్యుడిగా చేరాడు. అనంతగిరి స్వామి శిష్యులకు ఈ యాగంలో రుత్వికులు గా అవకాశం రావడంతో అజయ్‌శర్మకు హోమం వద్ద రుత్వికుడిగా అవకాశం లభించింది. తన కుమారుడు అజయ్‌శర్మను అన్నిరకాల తత్వాలు నేర్చుకున్న వ్యక్తిగా చూడటం ఆనందం గా ఉందని తల్లిదండ్రులు శ్రీదేవి, హరికిషనశర్మ తెలిపారు.

Updated Date - Dec 24 , 2024 | 12:57 AM