Share News

యాదాద్రి ప్లాంట్‌పై ‘ఆంధ్రజ్యోతి’ హెడ్డింగ్‌ చూశా

ABN , Publish Date - Feb 13 , 2024 | 03:46 AM

కేఆర్‌ఎంబీపై అసెంబ్లీలో నీటి పారుదల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ అనంతరం బీఆర్‌ఎస్‌ తరఫున మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ..

యాదాద్రి ప్లాంట్‌పై ‘ఆంధ్రజ్యోతి’ హెడ్డింగ్‌ చూశా

మంత్రి కోమటిరెడ్డిని ఉద్దేశిస్తూ హరీశ్‌రావు వ్యాఖ్య

హైదరాబాద్‌, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): కేఆర్‌ఎంబీపై అసెంబ్లీలో నీటి పారుదల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ అనంతరం బీఆర్‌ఎస్‌ తరఫున మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ.. ‘ఆంధ్రజ్యోతి’ కథనాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించబోమంటున్న ప్రభుత్వం తీర్మానంపై ఇంకా అభ్యంతరాలున్నాయని హరీశ్‌ అనగా, ఆయన ప్రసంగాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీనిపై హరీశ్‌ స్పందిస్తూ.. ‘‘ఆంధ్రజ్యోతి’ హెడ్డింగ్‌ చూశా.. మీదే కదా’’ అని అన్నారు. బీపీ లేసినట్లుంది గోలీలేసుకుని రా అంటూ కోమటిరెడ్డిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. కాగా, యాదాద్రి థర్మల్‌ కేంద్రం పనులపై ‘మాకేంటి’ శీర్షికన సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక రాజకీయ క్రీనీడ పడి మార్చిలో జరగాల్సిన రెండు ప్లాంట్ల ప్రారంభోత్సవంలో అనివార్య జాప్యం నెలకొందని అందులో ఉంది. గత ప్రభుత్వం తరహాలోనే తమతోనూ ‘వ్యవహారాలు’ జరపాలని డిమాండ్‌ చేస్తుండడంతో నాలుగు నెలలుగా రూ.2వేల కోట్ల బిల్లులూ పెండింగ్‌ పడి కాంట్రాక్టు సంస్థలు లబోదిబో అంటున్నాయని పేర్కొంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే హరీశ్‌ వ్యాఖ్యలు చేశారు.

Updated Date - Feb 13 , 2024 | 03:46 AM