Asifabad: అదే పులి!
ABN , Publish Date - Dec 02 , 2024 | 04:53 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సంచరిస్తున్న పెద్ద పులి కోసం అన్వేషణ కొనసాగుతోంది. అయితే, కాగజ్‌నగర్ మం డలం నజ్రూల్‌నగర్‌లో యువతి మరణానికి కారణమైన పులి, సిర్పూర్(టి) మండలంలో రైతుపై దాడి చేసిన పులి
యువతి, రైతుపై దాడి చేసింది ఒక్కటే : పీసీసీఎఫ్
సిర్పూర్(టి), డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సంచరిస్తున్న పెద్ద పులి కోసం అన్వేషణ కొనసాగుతోంది. అయితే, కాగజ్‌నగర్ మం డలం నజ్రూల్‌నగర్‌లో యువతి మరణానికి కారణమైన పులి, సిర్పూర్(టి) మండలంలో రైతుపై దాడి చేసిన పులి ఒక్కటేనని పీసీసీఎఫ్ (ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్) ఏలుసింగ్ మేరు ఆదివారం తెలిపారు. సిర్పూర్(టి) మండలం ఇటిక్యాలపహాడ్, దుబ్బగూడ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. పులి దాడి జరిగిన ప్రదేశాలను, పులి పాదముద్రలను పరిశీలించారు. అటవీ సమీప ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పత్తి ఏరడానికి, అటవీ ప్రాంతానికి గుంపులుగా వెళ్లాలని, తల వెనుక భాగంలో మాస్కులు ధరించాలని సూచన చేశారు. ఇటిక్యాల పహాడ్ ప్రజలకు ప్రత్యేక మాస్కులను పంపిణీ చేశారు.