ఆదాయంలో రెండోస్థానం...
ABN , Publish Date - Nov 24 , 2024 | 12:39 AM
గతంలో వెనుకంజలో ఉన్న దేవరకొండ ఆర్టీసీ డిపో ఆదాయంలో నల్లగొండ రీజనల్‌లోనే రెండోస్థానంలో నిలిచింది. దేవరకొండ డిపోలో 110 బస్సులకుగాను 103 బస్సులు నడుస్తున్నాయి.
ఆదాయంలో రెండోస్థానం...
ప్రగతిపథంలో దేవరకొండ ఆర్టీసీ డిపో
నల్లగొండ రీజియనలోనే ఉత్తమ డిపో అవార్డు
సమష్టి కృషితోనే కృషితోనే ఫలితాలు : డీఎం
దేవరకొండ, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): గతంలో వెనుకంజలో ఉన్న దేవరకొండ ఆర్టీసీ డిపో ఆదాయంలో నల్లగొండ రీజనల్‌లోనే రెండోస్థానంలో నిలిచింది. దేవరకొండ డిపోలో 110 బస్సులకుగాను 103 బస్సులు నడుస్తున్నాయి. ప్రతీరోజు 42 వేల నుంచి 43 వేల కిలోమీటర్ల వరకు బస్సులు నడుస్తున్నాయి. డిపోలో డీఎం, అసిస్టెంట్ డీఎంతో పాటు 391 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. దేవరకొండ ఆర్టీసీ డిపోకు ఈ నెల 20వ తేదీన నల్లగొండలో రీజినల్ పరిధిలో ప్రతీ మూడు నెలలకు ఒకసారి జరిగే త్రైమాసిక ప్రగతిచక్ర అవార్డులను దేవరకొండ డిపోకు ఏడు అవార్డులు వచ్చాయి. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఏడుగురు ఉద్యోగులు రీజనల్ మేనేజర్ రాజశేఖర్ అందజేశారు. ప్రశంసాపత్రాలతో పాటు 750 నగదు బహుమతులను అందుకున్నారు. ఆదాయంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఉత్తమ సేవలు అందించిన టీం డ్రైవర్లు వీవీ రెడ్డి, బురానుద్దీన, ఎల్లయ్య, ఎల్.నగేష్, అమరేష్, మెకానిక్ శ్రీనివాస్ అవార్డులు అందుకోగా వీవీ రెడ్డికి రెండు అవార్డులు అందజేశారు. దసరాకు దేవరకొండ డిపో నుంచి 45, 533 కిలోమీటర్లు బస్సులను నడిపి 47.83 లక్షల ఆదాయాన్ని తీసుకువచ్చి రాష్ట్రస్థాయిలోనే ప్రథమస్థానంలో నిలిచింది దేవరకొండ డిపో. దీంతో పాటు ఓఆర్‌లో సైతం రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు, ఉద్యోగులు సమష్టిగా కృషి చేయడం వల్లే దేవరకొండ డిపో లాభాల బాటలో పయనిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. మరింత ఉత్సాహంతో పనిచేసి దేవరకొండ డిపోకు రాష్ట్రస్థాయిలోనే గుర్తింపు తీసుకురావాలని ఉన్నత అధికారులు ఉద్యోగులను కోరుతున్నారు. దేవరకొండ డిపో నుంచి అత్యధికంగా బస్సులు హైదరాబాద్‌కు నడుస్తున్నాయి. ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు హైదరాబాద్‌కు నడుస్తుంది. హైదరాబాద్‌తో పాటు నల్లగొండ, మిర్యాలగూడతో పాటు అన్ని ప్రధాన పట్టణాలు, గ్రామాలకు బస్సులను నడిపిస్తున్నారు. తిరుపతి పుణ్యక్షేత్రానికి సైతం దేవరకొండ నుంచి బస్సును నడుపుతున్నారు.
ఉద్యోగుల కృషి, ప్రయాణికుల సహకారం
దేవరకొండ డిపోలో ఉద్యోగులు, అధికారులు స మష్టి కృషితో పనిచేస్తున్నారు. ప్రయాణికుల సూ చనలు, సలహాలు తీసుకొని బస్సులు నడుపుతు న్నాం. అందరి సమష్టి కృషి, ప్రయాణికుల సహకారంతోనే లాభాల బాటలో ముందుకు వెళుతున్నాం.
సైదులుయాదవ్, డిపో అసిస్టెంట్ మేనేజర్
అన్నంపెట్టే ఆర్టీసీని నమ్ముకొని పనిచేస్తున్నా
అన్నంపెట్టే ఆర్టీసీని నమ్ముకొని క్రమశిక్షణతో ప నిచేస్తున్నా. బస్సులో కండక్టర్ లేకపోయినా టిక్కెట్ కొట్టి ప్రయాణికుల సూచనల మేరకు చెయ్యి ఎత్తిన చోట బస్సును ఆపి తీసుకెళ్తున్నాను. ఉన్నతాధికారులు తనను ప్రోత్సహించి ప్రగతిచక్ర అవార్డు ఇవ్వడం సంతోషంగా ఉంది.
వీవీరెడ్డి, డ్రైవర్
డిపో ఆదాయం పెంచేందుకు ప్రయత్నం
ప్రయాణికుల కోరిక మేరకు ఆర్టీసీ బస్సులు నడుపుతున్నాం. జాతరలకు ప్రత్యేక బస్సులు నడుపుతు న్నాం. దేవరకొండ బస్టాండ్‌కు రీజనల్ పరిధిలోనే బెస్ట్ అవార్డు వచ్చింది. బస్టాండ్‌లో సౌకర్యాలు, వసతులు కల్పించినందుకు ఉన్నతాధికారులు అవార్డును అందజేశారు.
రమే్‌షబాబు, ఆర్టీసీ డీఎం, దేవరకొండ