Share News

సీతమ్మ సాగర్‌ పనులు ఆపండి

ABN , Publish Date - Jan 12 , 2024 | 05:33 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వాపురం మండలంలోని అమ్మగారిపల్లి వద్ద గోదావరిపై తలపెట్టిన ‘సీతారామ ఎత్తిపోతల పథకం- సీతమ్మసాగర్‌ బహుళార్థ సాధక ప్రాజెక్టు’ నిర్మాణ పనులను తక్షణమే ఆపేయాలని కేంద్రం ఆదేశించింది.

సీతమ్మ సాగర్‌ పనులు ఆపండి

ప్రాజెక్టు సీఈపై చర్యలు తీసుకోండి: కేంద్రం

హైదరాబాద్‌, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వాపురం మండలంలోని అమ్మగారిపల్లి వద్ద గోదావరిపై తలపెట్టిన ‘సీతారామ ఎత్తిపోతల పథకం- సీతమ్మసాగర్‌ బహుళార్థ సాధక ప్రాజెక్టు’ నిర్మాణ పనులను తక్షణమే ఆపేయాలని కేంద్రం ఆదేశించింది. అంతేకాక, ప్రాజెక్టు చీఫ్‌ ఇంజనీర్‌(సీఈ) శ్రీనివాస్‌ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సూచించింది. ప్రాజెక్టును ఉల్లంఘనల కేటగిరీలో టర్మ్‌ అండ్‌ రిఫరెన్స్‌ జారీ చేయడానికి అవసరమైన ప్రతిపాదన సమర్పించాలని కోరింది. ఈ మేరకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ రాష్ట్ర నీటిపారుదల శాఖకు ఓ లేఖ రాసింది. నిజానికి, పర్యావరణ అనుమతి తీసుకోకుండా సీతమ్మసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నారని దాఖలైన పిటిషన్‌ను విచారించిన ఎన్జీటీ ప్రాజెక్టు పనులను ఆపాలని ఇది వరకే ఆదేశించింది. పనులు నిలిపివేశారో లేదో పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఓ కమిటీని కూడా వేసింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదికపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఎన్జీటీ మరో కమిటీని వేసింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా పనులు కొనసాగుతున్నాయని గుర్తించిన ఎన్జీటీ తీవ్రంగా స్పందించింది. ప్రాజెక్టు పనులు నిలిపివేసి, సీఈపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

Updated Date - Jan 12 , 2024 | 05:33 AM