40కిలోల గంజాయి పట్టివేత
ABN , Publish Date - Jan 20 , 2024 | 10:55 PM
కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలులో 40 కిలోల గంజాయినిఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు.
తాండూరు, జనవరి 20 : కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలులో 40 కిలోల గంజాయినిఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. శనివారం భువనేశ్వర్ నుంచి పూణె వెళ్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ను తాండూరులో తనిఖీ చేశారు. తమిళనాడు చెందిన పీటర్‌ఫ్రాన్సిస్ 40 కిలోల ఎండు గంజాయితో పట్టుబడినట్లు ఎక్సైజ్ సీఐ అనంతయ్య తెలిపారు. ఒడిశా రాష్ట్రంలోని అటవీ ప్రాంతంలో కొనుగోలు చేసి కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో పూణె తరలిస్తున్నట్లు విచారణకు తేలిందని తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి మెజిస్ర్టేట్ ముందు హాజరు పరుచగా పరిగి సబ్ జైలు తరలించినట్లు తెలిపారు. ఈ దాడుల్లో వికారాబాద్ డీటీఎఫ్‌సీ ధన్వంత్‌రెడ్డి, ఎస్‌ఐ కోటేశ్వరరావు తాండూరు ఎక్సైజ్ ఎస్‌ఐలు చంద్రకాంత్‌రెడ్డి చిన్నరాయుడు పాల్గొన్నారు.