Share News

TS News: శంషాబాద్ ఇండస్ఇండ్ బ్యాంక్ మేనేజర్ రామస్వామి అరెస్ట్

ABN , Publish Date - Jul 30 , 2024 | 08:54 PM

నగరంలో వెలుగుచూసిన రూ.40 కోట్ల స్కామ్‌లో సైబరాబాద్ పోలీసులు పురోగతి సాధించారు. శంషాబాద్ ఇండస్‌ఇండ్ బ్యాంక్ మేనేజర్ రామస్వామిని అరెస్ట్ చేశారు. మరో బ్యాంకు ఉద్యోగి రాజేశ్‌తో కలిసి రూ.40 కోట్లు స్వాహా చేశారు.

TS News: శంషాబాద్ ఇండస్ఇండ్ బ్యాంక్ మేనేజర్ రామస్వామి అరెస్ట్
IndusInd Bank

హైదరాబాద్: నగరంలో వెలుగుచూసిన రూ.40 కోట్ల స్కామ్‌లో సైబరాబాద్ పోలీసులు పురోగతి సాధించారు. శంషాబాద్ ఇండస్‌ఇండ్ బ్యాంక్ మేనేజర్ రామస్వామిని అరెస్ట్ చేశారు. మరో బ్యాంకు ఉద్యోగి రాజేశ్‌తో కలిసి రూ.40 కోట్లు స్వాహా చేశారు. ముంబై హెడ్ ఆఫీస్ నోటీసులో లేకుండానే రామస్వామి రూ.40 కోట్లు ట్రాన్స్‌ఫర్ చేశాడు. మరో నిందితుడు షేక్ బషీద్‌కు బ్యాంక్ మేనేజర్ రామస్వామి బదిలీ చేశాడు. బషీద్ నుంచి మరికొన్ని అకౌంట్లకు రూ.40 కోట్ల సొమ్ము ట్రాన్స్‌ఫర్ అయ్యింది. తన ఖాతాకు డబ్బులు బదిలీ చేసినందుకు బ్యాంక్ మేనేజర్ రామస్వామికి బషీద్ 2 ఫార్చునర్ కార్లను బహుమతిగా అందించారు.


ఫ్లాట్ తాళాలు పగలగొట్టి 50 తులాల బంగారం చోరీ

నగరంలోని గాంధీనగర్ పీఎస్ పరిధిలో ఓ ఫ్లాట్‌లో చోరీ జరిగింది. ఓ ఫ్లాట్ తాళాలు పగలకొట్టి 50 తులాల బంగారు నగలు, లక్ష రూపాయల నగదును గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. గాంధీనగర్ పీఎస్ పరిధిలోని బన్స్ లాల్ పేట్ కృష్ణానగర్‌లో శ్రీ షీలా రెవెన్యూ అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన జరిగింది. అపార్ట్‌మెంట్‌లోని మూడో అంతస్తులో ఉన్న 303 ఫ్లాట్లో పట్టపగలే ఈ చోరీ జరిగింది. బాధితుదు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు గాంధీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాంధీనగర్ పోలీసు క్లూస్ టీం గాంధీనగర్ చేరుకుంది. మరోపక్క చుట్టుపక్క ప్రాంతాల్లోని వారిని అడిగి పోలీసులు వివరాలు తెలుసుకుంటున్నారు.

Updated Date - Jul 30 , 2024 | 08:54 PM