Share News

KTR : ప్రజలే ట్రాన్స్‌ఫార్మర్లు పెట్టుకోవాలా?

ABN , Publish Date - Nov 20 , 2024 | 05:16 AM

విద్యుత్‌ నిర్వహణ, సరఫరా చేతకాని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెట్టేలా మరో తుగ్లక్‌ చర్య చేపట్టిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

KTR : ప్రజలే ట్రాన్స్‌ఫార్మర్లు పెట్టుకోవాలా?

జనంపై భారం మోపే ప్రయత్నం తగదు

ఇబ్బంది పెట్టేలా మరో తుగ్లక్‌ చర్య

విద్యుత్తు నిర్వహణ చేతగాని సర్కార్‌: కేటీఆర్‌

టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ నోటీసులపై ఆగ్రహం

సీఎం రేవంత్‌ స్పందించాలని డిమాండ్‌ ప్రజలే ట్రాన్స్‌ఫార్మర్లు పెట్టుకోవాలా?: కేటీఆర్‌

హైదరాబాద్‌, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ నిర్వహణ, సరఫరా చేతకాని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెట్టేలా మరో తుగ్లక్‌ చర్య చేపట్టిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. హైదరాబాద్‌లో విద్యుత్‌ వినియోగం పెరిగిందని, దానికి ప్రజలే వ్యక్తిగతంగా ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసుకోవాలంటూ ప్రభుత్వం జనంపై భారం మోపే ప్రయత్నం తగదని పేర్కొన్నారు. అపార్ట్‌మెంట్‌ సముదాయాల్లో విద్యుత్‌ వినియోగం 20 కిలోవాట్‌ (కేడబ్ల్యూ) దాటితే అపార్ట్‌మెంట్‌ వాసులు సొంతంగా ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేసుకోవాలని టీఎ్‌సఎ్‌సపీడీసీఎల్‌ నోటీసులు ఇవ్వడంపై మంగళవారం ఒక ప్రకటనలో ఆయన అభ్యంతరం వ్యక్తంచేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ నిబంధన ఎందుకు తెచ్చారని ప్రశ్నించారు. దీనిపై సీఎం రేవంత్‌ రెడ్డి స్పందించాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

Updated Date - Nov 20 , 2024 | 05:16 AM