Manchiryāla- సీతారాం ఏచూరి జీవితం స్ఫూర్తిదాయకం
ABN , Publish Date - Sep 15 , 2024 | 11:12 PM
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి జీవితాం స్ఫూర్తిదాయకమని, ఆయన మరణం దేశానికి తీరని లోటని రాష్ట్ర కమిటీ సభ్యుడు ఫైళ్ల ఆశయ్య అన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం సీతారాం ఏచూరి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
మంచిర్యాల కలెక్టరేట్, సెప్టెంబరు 15: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి జీవితాం స్ఫూర్తిదాయకమని, ఆయన మరణం దేశానికి తీరని లోటని రాష్ట్ర కమిటీ సభ్యుడు ఫైళ్ల ఆశయ్య అన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం సీతారాం ఏచూరి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి ఉద్యమంలో తమదైన శైలిలో విద్యరంగంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేశారని కొనియాడారు. కామన్ మినిమం ప్రోగ్రాం రూపొందించడలో కీలక పాత్ర పోషించారన్నారు. కమ్యూనిస్టు భావజాలంతో ప్రజా ఉద్యమంలో రెండు పర్యాయాలు పార్లమెంటు సభ్యుడిగా పార్టీలకు అతీతంగా ప్రశంసలు అందుకున్నారని చెప్పారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి, గోమాస ప్రకాష్, ప్రేమ్‌కుమార్, మహేష్, మోహన్, నర్సింగరావు, హన్మంతరెడ్డి పాల్గొన్నారు.