Share News

HYDRA News: జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతలకు రంగం సిద్ధం!. దూకుడు పెంచిన హైడ్రా..

ABN , Publish Date - Aug 25 , 2024 | 09:21 AM

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు చెందినదేనంటూ కాంగ్రెస్ పార్టీ పదేపదే చెబుతున్న జన్వాడలోని ఫామ్ హౌస్ కూల్చివేతకు హైడ్రా దూకుడు పెంచినట్టు తెలుస్తోంది. ఈ దిశగా దూకుడు పెంచినట్టుగా సమాచారం. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత ప్రముఖుల అక్రమ నిర్మాణాలే టార్గెట్‌గా దూసుకుపోతున్న హైడ్రా.. 111 జీవో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన జన్వాడ ఫామ్ హౌస్‌పై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది.

 HYDRA News: జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతలకు రంగం సిద్ధం!. దూకుడు పెంచిన హైడ్రా..

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు చెందినదేనంటూ కాంగ్రెస్ పార్టీ పదేపదే చెబుతున్న జన్వాడలోని ఫామ్ హౌస్ కూల్చివేతకు హైడ్రా దూకుడు పెంచినట్టు తెలుస్తోంది. ఈ దిశగా దూకుడు పెంచినట్టుగా సమాచారం. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత ప్రముఖుల అక్రమ నిర్మాణాలే టార్గెట్‌గా దూసుకుపోతున్న హైడ్రా.. 111 జీవో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన జన్వాడ ఫామ్ హౌస్‌పై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. కూల్చివేతలకు రంగం సిద్ధమైనట్టు సమాచారం. మరోవైపు.. చెరువుల్లో అక్రమంగా నిర్మించిన మల్లారెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి నిర్మాణాలపై చర్యలకు కూడా సిద్ధమైనట్టు తెలుస్తోంది. మల్లారెడ్డి అక్రమ నిర్మాణాలపై హైడ్రాకు భారీగా ఫిర్యాదులు అందిన విషయం తెలిసిందే. కాగా వారం రోజుల వ్యవధిలో ఏకంగా 70కి పైగా అక్రమ నిర్మాణాలను హైడ్రా నేలమట్టం చేసింది.


కాగా జన్వాడలోని ఫామ్ హౌస్ కేటీఆర్‌దేనంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ ఫామ్ హౌస్ తనది కాదని కేటీఆర్ ఇదివరకే చెప్పారు. ఇటీవలే మీడియాతో మాట్లాడిన ఆయన.. తనకు ఎలాంటి ఫామ్ హౌస్ లేదని, జన్వాడలో ఉన్న ఫామ్ హౌస్ తన స్నేహితుడిదని చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఆ ఫామ్ హౌస్‌ను లీజుకు తీసుకున్నానని కేటీఆర్ చెప్పారు.


టార్గెట్‌‌లో మల్లారెడ్డి?

చెరువుల్లో ఆక్రమణల కూల్చివేత యథావిథంగా కొనసాగుతుందని హైడ్రా వర్గాలు చెబుతున్నాయి. దీంతో అక్రమంగా నిర్మాణాలు చేపట్టినవారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కాగా మేడ్చల్‌ జిల్లా పరిధిలోని మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన కళాశాలలు, హాస్టళ్లూ చెరువుల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌, ప్రభుత్వ స్థలాల్లో ఉన్నాయన్నది గత కొంత కాలంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తదుపరి కూల్చివేతలు మల్లారెడ్డికి సంబంధించిన నిర్మాణాలేనని ప్రచారం జరుగుతోంది.


మల్లారెడ్డికి సంబంధించిన పలు ఆక్రమణలపై కోర్టు స్టేలు ఉండగా.. ఇటీవల కాప్రా సర్కిల్‌ పరిధిలోని నిర్మాణంపై స్టే వెకేట్‌ అయినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో చర్యలు తీసుకునేందుకు మేడ్చల్‌ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. మరోవైపు ఘట్‌కేసర్‌ మండలం వెంకటాపూర్‌ పరిధిలోని నాదం చెరువు బఫర్‌ జోన్‌లోని 1.5ఎకరాలను ఆక్రమించి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అనురాగ్‌ యూనివర్సిటీ భవనాలు నిర్మించారని ఇరిగేషన్‌ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ నిర్మాణలపైనా చర్యలుంటాయని ప్రచారం జరుగుతోంది. మరి హైడ్రా ఎప్పుడు రంగంలోకి దిగుతుందో వేచిచూడాలి.

Updated Date - Aug 25 , 2024 | 09:21 AM