Share News

బోనాలతో ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల నిరసన

ABN , Publish Date - Dec 19 , 2024 | 11:39 PM

విద్యాశాఖలో పని చేస్తున్న సమగ్ర శిక్షా అభియాన్‌ ఉద్యోగులు నిరవధిక సమ్మె గురువారం 10వ రోజు బోనాలతో నిర సన వ్యక్తం చేశారు.

బోనాలతో ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల నిరసన
జిల్లా కేంద్రంలో బోనాలతో నిరసన ర్యాలీ నిర్వహిస్తున్న ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు

నాగర్‌కర్నూల్‌టౌన్‌, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి) : పట్టణంలోని పాత కలెక్ట రేట్‌ ఆవరణం నుంచి అంబేడ్కర్‌ కూడలి వరకు బోనాలతో ర్యాలీగా వెళ్లి అక్కడ మాన వహారం నిర్వహించారు. ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల జేఏసీ జిల్లా అధ్యక్షుడు మురళి మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వం స్పదించి తమ సమ స్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమం లో సంఘం జిల్లా కార్యదర్శి ప్రకాష్‌, సందీప్‌, సాయికుమార్‌, సుధాకర్‌, కుర్మయ్య, మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 19 , 2024 | 11:39 PM