త్వరలో స్టేడియం పనులు ప్రారంభం
ABN , Publish Date - Feb 05 , 2024 | 12:12 AM
భువనగిరి పట్టణ శివారులో 10 ఎకరాల విస్తీర్ణంలో ప్రతిపాదించిన మల్టీ స్సోర్స్ట్ స్టేడియం నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి
భువనగిరి టౌన్, ఫిబ్రవరి 4: భువనగిరి పట్టణ శివారులో 10 ఎకరాల విస్తీర్ణంలో ప్రతిపాదించిన మల్టీ స్సోర్స్ట్ స్టేడియం నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. భువనగిరిలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపిక పోటీలను ఆదివారం ప్రారంభించి మాట్లాడారు. క్రీడల్లో ప్రతిభ చూపే క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహి స్తుందన్నారు. క్రీడల్లో రాణించి భువనగిరి ఖ్యాతిని చాటాలన్నారు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 10న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగే తెలంగాణ స్టేట్ సబ్ జూనియర్ అథ్లెటిక్ చాంపియన్ షిప్‌లో జిల్లా జట్లకు ప్రాతినిధ్యం వహిస్తారని అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యద ర్శులు పోతంశెట్టి వెంకటేశ్వర్లు కోనేటి గోపాల్ తెలిపారు. కార్యక్రమంలో పోత్నక్ ప్రమోద్‌కుమార్ తంగెళ్లపల్లి రవికుమార్ పాల్గొన్నారు.
ఎంపికైన బాలురు
అండర్ -8 బాలుర 50 మీటర్ల పరుగు పందెంలో శ్రీరాం సూర్యాతేజ (ప్రథమ), మర్రి చర్విక్ (ద్వితీయ), దయ్యాల నితిష్ (తృతీయ), 300 మీటర్ల పరుగు పందెంలో రేగు అఖిల్(ప్రథమ), లావుడ్య చరణ్ (ద్వితీయ), లోకేశ్(తృతీయ), అండర్-10 వంద మీర్ట పరులు పందెంలో ధీరావత్ శ్రీరాం(ప్రథమ), రౌతుల గుణశంకర్‌రావు(ద్వితీయ), గుగులోతు హర్షన్(తృతీయ), 300 మీటర్ల పరుగు పందెంలో దండెబోయిన రాఖేష్ (ప్రథమ), భవానీతేజ (ద్వితీయ), ధీరావత్ సాయినాద్ (ద్వితీయ), లాంగ్ జంప్‌లో దండబోయిన రాఖేష్ (ప్రథమ), కొల్లు సాయికుమార్ (ద్వితీయ), జశ్వంత్(తృతీయ), అండన్ -12 వంద మీటర్ల పరుగు పందెంలో దయానమోని జశ్వంత్(ప్రథమ), అకుల అనిరుద్ (ద్వితీయ), బిల్ల లోకేష్ (తృతీయ), 400 మీటర్ల పరుగు పందెంలో బి లోకేష్ (ప్రథమ), అనిరుద్ (ద్వితీయ), సాయి(తృతీయ), 600 మీటర్ల పరుగు పందెంలో గౌసుకొండ ఈశ్వర్ (ప్రథమ), దూసరి సాయితేజ (ద్వితీయ), గుండబోయిన వర్షిత్(తృతీయ), లాంగ్ జంప్ జరపాల విశాల్ (ప్రథమ), దోసకాయల సర్వజ్ఞ (ద్వితీయ), రామిడి విష్ణువర్థన్‌రెడ్డి (తృతీయ), అండర్ -14 వంద మీటర్ల పరుగు పందెం కస్తుల విజ్ఞాన (ప్రథమ), మంద లక్ష్మన్ (ద్వితీయ), బొడ్డుపల్లి అద్విత్ (తృతీయ), 400 మీర్లు మడికొండ గణేష్(ప్రథమ), కస్తుల విజ్ఞాన్ (ద్వితీయ), పవన్‌కల్యాణ్ (తృతీయ), అండన్ -16, వంద మీటర్లు మొగ్గు ప్రవీణ్ (ప్రథమ), భానోతు విశాల్ (ద్వితీయ), గురజాల దీక్షిత్ (తృతీయ), 400 మీటర్లు భానోతు విశాల్(ప్రథమ), దీక్షిత్‌రెడ్డి (ద్వితీయ), శ్రీరామ్ నవీన్(తృతీయ), 600 మీటర్లు బోయ రవికుమార్ (ప్రథమ), అండెం సంజయ్‌రెడ్డి (ద్వితీయ), గురజాల దీక్షిత్ (తృతీయ).
ఎంపికైన బాలికలు
బాలికల అండర్ -8 విభాగంలో 50 మీటర్లు వడ్డె స్వినికబ్ (ప్రథమ), ధీరావత్ ఆనంది (ద్వితీయ), హెగ్గెపురం మాన్విక(తృతీయ), 300 మీటర్ల ఎనబోయిన నవ్యశ్రీ(ప్రథమ), బందనాదం ఎలిసా గ్రేస్ (ద్వితీయ), పసల అవంతిక(తృతీయ), అండర్-10 వంద మీటర్లు గుగులోతు వర్షిత (ప్రథమ), చిందింటి జశ్విత (ద్వితీయ), ఎండి ముంతాజ్(తృతీయ), 300 మీటర్లు వంగూరి శృతి (ప్రథమ), సి జశ్విత (ద్వితీయ), గుగులోతు వర్షిత (తృతీయ), అండర్ 12 వంద మీటర్లు మునుకుంట్ల ఇందు ప్రియ (ప్రథమ), నాగబండి అక్షిత (ద్వితీయ), పుల్లూరి సాత్విక (తృతీయ), 400 మీటర్లు ఏ తన్వి(ప్రథమ), రుత్విక(ద్వితీయ), ఉదయ శ్రీ(తృతీయ), 600 మీటర్లు అంకర్ల తన్వి(ప్రథమ), మేకల సంగీత(ద్వితీయ), అండె గగన (తృతీయ), అండర్ -14 వంద బీటర్లు పసల అశ్విత(ప్రథమ), కొత్తపల్లి అర్చన (ద్వితీయ), చుక్క లేఖ్య (తృతీయ), అండర్ -16 వంద మీటర్లు వెంకుడోతు వెన్నెల (ప్రథమ), వీర సంజన (ద్వితీయ), అల్లం మేరి అశ్విత (తృతీయ), 600 మీటర్లు వాంకుడోతు వెన్నెల (ప్రథమ), ఎర్ర సంజన (ద్వితీయ), గుగ్గిళ్ల గ్రీష్మ(తృతీయ).