Share News

ఇటుక బట్టీలకు చెరువు మట్టి తరలిస్తే చర్యలు

ABN , Publish Date - May 02 , 2024 | 12:18 AM

ఇటుక బట్టీలకు అనధికారికంగా చె రువు మట్టి తరలిస్తే కఠినచర్యలు తప్పవని మైనింగ్‌ శాఖ ఏడీ జాకబ్‌ అన్నారు.

ఇటుక బట్టీలకు చెరువు మట్టి తరలిస్తే చర్యలు
ఇటుక బట్టీల నిర్వాహకులతో మైనింగ్‌ ఏడీ జాకబ్‌

ఇటుక బట్టీలకు చెరువు మట్టి తరలిస్తే చర్యలు

మైనింగ్‌ ఏడీ జాకబ్‌

మిర్యాలగూడ, మే 1: ఇటుక బట్టీలకు అనధికారికంగా చె రువు మట్టి తరలిస్తే కఠినచర్యలు తప్పవని మైనింగ్‌ శాఖ ఏడీ జాకబ్‌ అన్నారు. పట్టణంలో ఇటుక బట్టీ నిర్వాహకులకు బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇటుక బట్టీలను తప్పనిసరిగా రిజిస్ర్టేషన చేయించుకోవాలన్నారు. చెరువు మట్టికి రాయల్టీ చెల్లిచిన బిల్లులను సం బంధిత అధికారులకు చూపించి మట్టిని తీసుకెళ్లాలని అన్నారు. బట్టీల్లో బడీడు పిల్లలతో పనిచేయించరాదని సూచించారు. వా రిని పనిలో చేర్చుకుంటే బట్టీల లైసెన్స రద్దు చేయనున్నట్లు తెలి పారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరిం చారు. బట్టీ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకుంటే సకాలంలో అనుమతులు మంజూరు చేసేలా సహాయ సహకారాలు అందిస్తామ ని తెలిపారు. కార్యక్రమంలో బట్టీల నిర్వాహకులు పి.ప్రభాకర్‌రె డ్డి, వై.రవీందర్‌రెడ్డి, బండారు ప్రసాద్‌, జేవీ రమణ, కె.సీతారాంరెడ్డి, మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 02 , 2024 | 12:18 AM