Share News

ఆత్మహత్యలపై అసెంబ్లీలో చర్చించాలి:ప్రవీణ్‌

ABN , Publish Date - Feb 13 , 2024 | 03:33 AM

ప్రభుత్వ సంక్షేమ గురుకులాలు, వసతి గృహాల్లో జరుగుతున్న వరుస ఆత్మహత్యలకు సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యత వహించాలని, విద్యార్థుల బలవన్మరణాలపై అసెంబ్లీలో చర్చించాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు

  ఆత్మహత్యలపై అసెంబ్లీలో చర్చించాలి:ప్రవీణ్‌

కార్వాన్‌, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సంక్షేమ గురుకులాలు, వసతి గృహాల్లో జరుగుతున్న వరుస ఆత్మహత్యలకు సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యత వహించాలని, విద్యార్థుల బలవన్మరణాలపై అసెంబ్లీలో చర్చించాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎ్‌స.ప్రవీణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం హైదరాబాదులోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్‌ ఎదుట బీఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమశాఖలకు మంత్రులను ఎందుకు నియమించలేదని ప్రశ్నించారు. ఆత్మహత్యల్ని నియంత్రించేందుకు ప్రతి గురుకుల పాఠశాలలో పిల్లలకు కౌన్సిలింగ్‌ ఇచ్చేందుకు గానూ సైకాలజిస్టును నియమించాలని సూచించారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పన ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలుగానే భావించాలని ఎంవీఎఫ్‌ జాతీయ కన్వీనర్‌ ఆర్‌.వెంకట్‌ రెడ్డి అన్నారు.

Updated Date - Feb 13 , 2024 | 03:33 AM