Share News

Ramakrishna Math: రామకృష్ణ మఠంలో వేసవి శిబిరాలు

ABN , Publish Date - Apr 04 , 2024 | 08:30 PM

హైదరాబాద్‌లోని రామకృష్ణ మఠానికి చెందిన ‘వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్’ సంస్కార్ - 2024 పేరిట నాలుగో తరగతి నుంచి పదో తరగతి చదివే విద్యార్థులకు వేసవి శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తుంది.

Ramakrishna Math: రామకృష్ణ మఠంలో వేసవి శిబిరాలు

హైదరాబాద్‌లోని (Hyderabad) రామకృష్ణ మఠానికి (Ramakrishna Math) చెందిన ‘వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్’ సంస్కార్ - 2024 పేరిట నాలుగో తరగతి నుంచి పదో తరగతి చదివే విద్యార్థులకు వేసవి శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తుంది. నాలుగు నుంచి ఏడో తరగతి వరకు జరిగే శిక్షణా శిబిరం ఏప్రిల్ 29న ప్రారంభమై మే 10న ముగుస్తుంది. 12 రోజుల పాటు ఉదయం 8:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు క్లాసులు జరగనున్నాయి. అలాగే.. 8, 9, 10వ తరగతుల వారికి మే 14వ తేదీ నుంచి మే 25వ తేదీ వరకు క్లాసెస్ నిర్వహించనున్నారు. ఇవి కూడా 12 రోజుల పాటు ఉదయం 8:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు జరగనున్నట్టు తెలిపారు. వెబ్‌సైట్‌లో సంబంధిత కోర్సు కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వీఐహెచ్ఈ తెలిపింది. ఏప్రిల్ 28న ప్రారంభ కార్యక్రమం జరగనుంది.


Matthew Miller: కేజ్రీవాల్ అరెస్ట్.. ఆ విమర్శలకు చెక్ పెట్టిన అమెరికా

మరోవైపు.. ఏప్రిల్ 15 - 25 వరకు 12 రోజుల పాటు శ్రద్ధ శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. దీనికి ఇంటర్ విద్యార్థులు.. అంటే 11, 12 తరగతులకు చెందిన వారు అర్హులు. 12వ తరగతి ఫైనల్ పరీక్షలు రాసిన వారు కూడా అర్హులే. వీరికి ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు తరగతులు ఉంటాయి. ఈ శిబిరంలో యోగా, ధ్యానం, వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందింప చేసేలా స్వామిజీలు శిక్షణ ఇవ్వనున్నారు. మరిన్ని వివరాలకు గాను వాట్సాప్ నంబర్ 9177232696 లో సంప్రదించవచ్చని రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద (Swami Bodhamayananda) చెప్పారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 04 , 2024 | 08:30 PM