Share News

గ్రామోద్యోగ్‌ వికాస్‌ యోజనను సద్వినియోగం చేసుకోవాలి

ABN , Publish Date - Oct 23 , 2024 | 12:32 AM

కేంద్ర ప్రభుత్వ సూక్ష్మ, చిన్న తరహా సంస్థల పరిధిలో గల ఖాదీ అండ్‌ విలేజ్‌ ఇండస్ట్రీస్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న గ్రామోద్యోగ్‌ వికాస్‌ యోజనను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కేవీఐసీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారి ఎన్‌ లతాదేవి అన్నారు.

గ్రామోద్యోగ్‌ వికాస్‌ యోజనను సద్వినియోగం చేసుకోవాలి
మాట్లాడుతున్న కేవీఐసీ జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారిణి ఎన్‌ లత దేవి

- కేవీఐసీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారి ఎన్‌ లతాదేవి

జగిత్యాల, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ సూక్ష్మ, చిన్న తరహా సంస్థల పరిధిలో గల ఖాదీ అండ్‌ విలేజ్‌ ఇండస్ట్రీస్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న గ్రామోద్యోగ్‌ వికాస్‌ యోజనను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కేవీఐసీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారి ఎన్‌ లతాదేవి అన్నారు. మంగళవారం పట్టణంలోని గోవిందుపల్లిలో గల వీకేబీ పంక్షన్‌ హాలులో నిర్వహించిన విలేజ్‌ ఇండస్ట్రీస్‌ అక్టివిటీస్‌ గ్రామోద్యోగ వికాస్‌ యోజన 2024-25 కార్యక్రమంలో అవగాహణ సదస్సు నిర్వహించారు. కేవీఐసీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డీజీ ప్రసాద్‌శర్మ, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎన్‌ లతాదేవీ, జూనియర్‌ ఎగ్జిక్యూ టివ్‌ అంజనాదేవీ పలు అంశాలను వివరించారు. ఈ సందర్బంగా సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ లతాదేవీ మాట్లాడుతూ ఖాదీ విలేజ్‌ ఇండస్ట్రీస్‌ కమిషన్‌ దేశవ్యాప్తంగా ఉమ్మడి సౌకర్యాలు, సాంకేతిక అధుని కీకరణ, శిక్షణ మొదలైన వాటిని అందించడం ద్వారా గ్రామ పరిశ్రమల ప్రోత్సాహం, అభివృద్ధి కొరకు గ్రామోద్యోగ్‌ వికాస్‌ యోజన పథకాన్ని అమలు చేస్తుందన్నారు. 2024-25 సంవత్సరానికి పథకం కింద అర్హత ఉన్న వ్యక్తులకు అందించడానికి అవసరమైన పనులు చేస్తున్నామన్నారు. ఇందులో శిక్షణ, సాధనాలను అందించడం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాన్ని అర్హులైన వ్యక్తులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు చేతి వృత్తులకు చెందిన వ్యక్తులు, బీసీ సంక్షేమ శాఖ అధికారులు, చిన్న వ్యాపారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 23 , 2024 | 12:32 AM