Food Safety: ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ ఫుడ్ బ్యాన్
ABN , Publish Date - Oct 30 , 2024 | 05:55 PM
ప్రాణాలు హరించివేస్తున్న మయోనైజ్‌పై నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ బుధవారం ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్: ప్రాణాలు హరించివేస్తున్న మయోనైజ్‌పై నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. డా.బీఆర్ అంబేడ్కర్ సెక్రటేరియెట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులతో దామోదర రాజ నర్సింహా బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో హోటళ్లలో తనిఖీలు, కల్తీ ఆహార పదార్థాల వినియోగాన్ని అరికట్టడానికి నియమించిన టాస్క్‌ఫోర్స్ కమిటీల పనితీరుపై మంత్రి ఆరా తీశారు. వివిధ రకాల ఆహార పదార్థాలతో మయోనైజ్‌ను తయారు చేస్తున్నారని అధికారులు మంత్రి దామోదరకు చెప్పారు.
అందులో కల్తీ, ఉడకబెట్టని గుడ్లను ఉపయోగిస్తున్నారని.. దీని వల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం పడుతోందని మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా కేరళ ప్రభుత్వం మయోనైజ్ పై బ్యాన్ విధించిన విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణలోనూ మయోనైజ్ ను నిషేధం విధించాలని అధికారులు సూచించారు. సుదీర్ఘ చర్చల అనంతరం మయోనైజ్‌పై బ్యాన్ విధించాలని మంత్రి నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.
ఎంత డేంజరంటే..
ఫ్రాన్స్(France)లో పుట్టిన బర్గర్లు నుంచి శాండ్‌విచ్‌లు.. డిప్స్ నుంచి సలాడ్స్ వరకూ అన్నింట్లోనూ విరివిగా వాడేస్తోన్న ప్రధానమైన కాండిమెంట్స్‌లో ఒకటిగా నిలిచింది మయోనైజ్. మండీకి వెళ్లి బిర్యానీ తిన్నా, బార్బిక్యులో రోస్టెడ్ చికెన్ రుచి చూసినా, షవార్మ సెంటర్‌లో షవార్మ రోల్ తిన్నా, స్టార్ హోటల్స్‌లో కాక్‌టైల్ పార్టీలో స్నాక్స్‌తో పాటు మయోనైజ్ కామన్‌గా ఉంటుంది. అతి చిక్కగా ఉండే ఈ క్రీమీ సాస్‌ను పిల్లలు, పెద్దలూ ఇష్టంగానే తింటుంటారు. వెగన్ మయోనైజ్‌తో ఇబ్బందులు లేవుకానీ, ఎగ్ మయోనైజ్‌లో ప్రధానంగా వాడే గుడ్డు సొనలో ఉండే సాల్మొనెల్లా వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని న్యూట్రిషియనిస్ట్లు అంటున్నారు. హోటల్‌లో దీనిని తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలంటున్నారు. ఇంట్లో తయారుచేసుకున్న మయోనైజ్‌ను త్వరగా వినియోగించాలనీ, ముఖ్యంగా కార్డియో, ఇతర ఆరోగ్య సమస్యలున్న వారు వాటి జోలికి వెళ్లకపోవడం మంచిదంటున్నారు. హోటళ్లలో అందుబాటులో ఉంచిన మయోనైజ్ వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని, దాన్ని నిషేధించాలని జీహెచ్‌ఎంసీ ప్రభుత్వానికి నివేదికలు పంపుతుండడంతో అందరి దృష్టి మయోనైజ్‌పై పడింది. కేరళలో ఎగ్ మయోనైజ్‌పై ఇప్పటికే నిషేధం విధించారు.
ఇవి కూడా చదవండి...
Penny Stock: లక్ష పెట్టుబడితో 4 నెలల్లోనే రూ. 670 కోట్లు.. దేశంలోనే ఖరీదైన స్టాక్‌గా రికార్డ్
Read Latet Telangana News And Telugu News