Home » Damodara Rajanarasimha
రాబోయే రెండు, మూడు వారాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వస్తాయి. వర్గీకరణ చట్టం ప్రకారమే ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. మీ పిల్లలను ఉద్యోగాల పరీక్షలకు సిద్ధం చేయండి.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవుట్ పేషెంట్లు, ఇన్ పేషెంట్లు, వారి అటెండెంట్లకు, సిబ్బందికి తాగునీరు అందుబాటులో ఉంచాలని ఉన్నతాధికారులను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.
రాజధానిలో నిర్మిస్తోన్న మూడు టిమ్స్ ఆస్పత్రులను సెంటర్ ఎక్స్‌లెన్స్ కేంద్రాలుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సుల్తాన్‌పూర్‌లోని ఆందోల్ గ్రామంలో ఫార్మసీ పీజీ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 15 ఎకరాల భూమిని కేటాయించింది.
తెలంగాణ రాష్ట్ర అవయవ దానం బిల్లు-2025కు అసెంబ్లీ గురువారం ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం 2011లో కొన్ని సవరణలతో సమగ్రంగా రూపొందించిన చట్టాన్నే రాష్ట్రంలో కూడా అమలు చేయాలని నిర్ణయించి, దానికి అనుగుణంగా ఈ బిల్లుకు రూపకల్పన చేశారు.
ప్రైవేటు పాఠశాలల ఫీజు నియంత్రణ కోసం ఫీజు రెగ్యులేటరీ కమిషన్‌ను త్వరలో ఏర్పాటు చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చి, కొత్త పాఠశాలలు ప్రారంభించడం కంటే ప్రస్తుతవాటిని మెరుగుపరచే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు
Minister Damodar Raja Narasimha: ఎడ్యుకేషన్ కమిషన్ సూచనల మేరకు విద్యా వ్యవస్థను బాగుచేస్తామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. స్కూల్లో ఉన్న పిల్లల గురించి ఇంటిదగ్గర ఉన్న తల్లిదండ్రులు ఆందోళన చెందే పరిస్థితులు ఉండకూడదని చెప్పారు.
మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్‌ను నివారించేందుకు వాడే హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) టీకాలు అందించే విషయంపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.
అన్ని రంగాల్లో మహిళలు కీలకపాత్ర పోషించి, సమాజ గుణాత్మక పురోగాభివృద్థికి కృషి చేస్తున్నారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శనివారం ఆయన మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏక సభ్య కమిషన్ అద్భుతమైన నివేదిక ఇచ్చిందని, అందులో వంకలు పెట్టడానికి ఏమీ లేదని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.