Share News

మత్తు పదార్థాల తయారీ కేసులో తెలంగాణ యూనివర్సిటీ అధ్యాపకుడి అరెస్టు

ABN , Publish Date - Apr 04 , 2024 | 05:01 AM

నిజామాబాద్‌ జిల్లా తెలంగాణ విశ్వవిద్యాలయంలోని సౌత్‌ క్యాంప్‌స(బిక్కనూరు)లో పనిచేస్తున్న కెమిస్ట్రీ విభాగపు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ శ్రీనివా్‌సను మత్తు పదార్థాల తయారీ కేసులో బుధవారం

మత్తు పదార్థాల తయారీ కేసులో తెలంగాణ యూనివర్సిటీ అధ్యాపకుడి అరెస్టు

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 3(ఆంధ్రజ్యోతి): నిజామాబాద్‌ జిల్లా తెలంగాణ విశ్వవిద్యాలయంలోని సౌత్‌ క్యాంప్‌స(బిక్కనూరు)లో పనిచేస్తున్న కెమిస్ట్రీ విభాగపు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ శ్రీనివా్‌సను మత్తు పదార్థాల తయారీ కేసులో బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌ శివారులో గల మెడికమ్‌ ల్యాబ్‌ సంస్థలో ఇతనికి భాగస్వామ్యం ఉందని ఔషధ నియంత్రణ సంస్థ నిర్ధారణ చేసింది. దీంతో ఓ పక్క తెలంగాణ విశ్వవిద్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మరోపక్క చట్ట వ్యతిరేక వ్యాపారాన్ని నడుపుతున్న శ్రీనివా్‌సపై చర్యలు తీసుకునేందుకు వర్సిటీ అధికారులు సిద్ధమయ్యారు. ఇందుకోసం ఉన్నతాధికారులకు ఇప్పటికే సమాచారాన్ని అందజేశారు.

Updated Date - Apr 04 , 2024 | 08:54 AM