Exam: డిసెంబరు 29న ఎంపీహెచ్‌ఏ రాత పరీక్ష
ABN , Publish Date - Nov 09 , 2024 | 04:14 AM
ఎట్టకేలకు మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫీమేల్ (ఎంపీహెచ్‌ఏ) నియామక రాత పరీక్ష తేదీ ఖరారైంది. డిసెంబరు 29న ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు మెడికల్ బోర్డు కార్యదర్శి గోపీకాంత్ రెడ్డి వెల్లడించారు.
ఎట్టకేలకు మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫీమేల్ (ఎంపీహెచ్‌ఏ) నియామక రాత పరీక్ష తేదీ ఖరారైంది. డిసెంబరు 29న ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు మెడికల్ బోర్డు కార్యదర్శి గోపీకాంత్ రెడ్డి వెల్లడించారు. ఏఎన్‌ఎం పోస్టుల భర్తీకి గతేడాది జూలై 26న మెడికల్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. 1,520 ఎంపీహెచ్‌ఏ పోస్టుల భర్తీకి గతేడాది ఆగస్టు 25 నుంచి సెప్టెంబరు 19 వరకు దరఖాస్తులు స్వీకరించింది. మొత్తం 24వేల దరఖాస్తులు వచ్చాయి. నవంబరు 10న రాత పరీక్ష నిర్వహిస్తామని బోర్డు ప్రకటించింది. అయితే రాత పరీక్ష నిర్వహించే సమయానికి ఎన్నికల కోడ్ వచ్చింది. దీనికితోడు వైద్యశాఖలో కాంట్రాక్టు పద్ధతిలో ఎంపీహెచ్‌ఏలు ఈ నియామక ప్రక్రియను వ్యతిరేకిస్తూ... తమను రెగ్యులరైజ్ చేయాలని పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టారు. దాంతో సర్కారు వారికిచ్చే వెయిటేజ్‌ను 20-30 మార్కులకు పెంచింది. మరో 411 పోస్టులను పెంచింది. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 1,931కు పెరిగింది.