Home » TG Govt
భూ భారతి రెవెన్యూ చట్టాన్ని పైలట్ ప్రాజెక్టుగా నాలుగు మండలాల్లో అమలు చేస్తూ రైతులకు భూసమస్యల పరిష్కారానికి అవకాశం కల్పిస్తున్నారు. పాస్‌పుస్తకాలు, సాదా బైనామా, వివాదాస్పద ఖాతాల పరిష్కారంపై రైతులు ఆశలు పెట్టుకున్నారు
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద బేస్మెంట్ పూర్తి చేసిన 2,019 లబ్ధిదారుల ఖాతాల్లో రూ.20.19 కోట్లు నేరుగా జమ చేసినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. నాలుగు దశల్లో నిధులు విడుదల చేస్తామని, ప్రతి దశలో మొబైల్ యాప్ ద్వారా ఫొటోలు అప్లోడ్ చేసినా నిధులు అందుతాయని చెప్పారు
హైదరాబాద్‌ను గ్లోబల్ బిజినెస్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో 2030 నాటికి 200 మిలియన్ చదరపు అడుగుల కమర్షియల్ స్పేస్ అందుబాటులోకి వస్తుందని మంత్రి దుద్దిళ్ల తెలిపారు. జీసీసీల అభివృద్ధితో యువతకు లక్షల ఉద్యోగాలు లభిస్తున్నాయని అన్నారు.
తెలంగాణలో అంగన్వాడీ కేంద్రాలకు గుడ్ల సరఫరా కోసం మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ ఆహ్వానించిన టెండర్ గడువు మే 15 వరకూ పొడిగించింది. ఈ నిర్ణయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత టెండర్ దాఖలుకు అవకాశాలు పెరిగాయి.
వడగాల్పులు, వడదెబ్బలతో మరణించిన వారికి రూ.4 లక్షల పరిహారం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఈ పరిహారం ప్రత్యేక విపత్తు నిధి నుంచి మంజూరు చేయనున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు.
Bhu Bharati: భూములకు రక్షణ కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే భూ భారతి పోర్టల్‌ను ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోంది. ఈ పోర్టల్‌ను నిన్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ భూ భారతి పోర్టల్ రైతులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని రేవంత్ ప్రభుత్వం చెబుతోంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం సీఎల్పీ సమావేశం జరుగనుంది. భూ భారతి, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, ఎస్సీవర్గీకరణతో సహా ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల గురించి సీఎం రేవంత్‌రెడ్డి చర్చించనున్నారు.
Kanche Gachibowli Land Issue: తెలంగాణ వ్యాప్తంగా కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం సంచలనంగా మారింది. ఈ భూముల విషయంలో కొంతమంది కావాలనే ఫేక్ వీడియోలు, ఫొటోలు ప్రచారం చేశారని తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. దీంతో ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
కంచ గచ్చిబౌలి భూములు ప్రభుత్వానికి చెందినవేనని, ఎన్నో ఏళ్లుగా అవి రెవెన్యూ భూములుగా రికార్డుల్లో నమోదై ఉన్నాయని సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది.
దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం తీరును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తప్పుపట్టారు.