కేంద్ర ప్రభుత్వం రైతులపై కేసులను ఎత్తివేయాలి
ABN , Publish Date - Jan 22 , 2024 | 11:59 PM
రైతులపై కేంద్రంలో మోదీ ప్రభుత్వం పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని, రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దుచేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కంబాల శ్రీనివాస్, సంయుక్త కిసాన్‌మోర్చా(ఎ్‌సకేఎం) నాయకులు పల్లె వెంకటరెడ్డి, కాకి అజయ్‌రెడ్డి కోరారు.
హుజూర్‌నగర్, జనవరి 22 : రైతులపై కేంద్రంలో మోదీ ప్రభుత్వం పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని, రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దుచేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కంబాల శ్రీనివాస్, సంయుక్త కిసాన్‌మోర్చా(ఎ్‌సకేఎం) నాయకులు పల్లె వెంకటరెడ్డి, కాకి అజయ్‌రెడ్డి కోరారు. సోమవారం పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన అఖిలపక్షాల సమావేశంలో వారు మాట్లాడారు. రైతు ఉద్యమ సమయంలో ప్రధాని లిఖిత పూర్వకంగా ఇచ్చిన హామీలు అమలుచేయాలని డిమాండ్ చేశారు. పంటలకు మద్దతు ధర గ్యారెంటీ చట్టం అమలుచేయాలని, రుణవిముక్తి చట్టం చేయాలని, పంటల బీమా పథకాన్ని సవరించి అమలు చేయాలన్నారు. కార్మిక వ్యతిరేక నాలుగు కోడ్‌లను రద్దు చేయాలన్నారు. కేంద్రం 29 కార్మిక చట్టాలను, 4 కోడ్‌లుగా మార్చి అమలు చేసేందుకు పూనుకోవడం బరితెగింపు చర్యగా అభివర్ణించారు. ఈ నెల 26న హుజూర్‌నగర్‌లో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ట్రాక్టర్లు, ఇతర వాహనాలతో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహిస్తామన్నారు. ఈ ర్యాలీని విజయవంతం చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుతో దేశంలోని పేదలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక చర్యలకు ప్రభుత్వం పాలుపడుతోందన్నారు. కార్యక్రమంలో ఇందిరాల వెంకటేశ్వర్లు, శీలం శ్రీను, జక్కుల రమేష్, బ్రహ్మం, చంద్రం, నాగయ్య, సైదులు, హుస్సేన్, ఉపేందర్, కనకారావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.