బీజేపీ తీరుతో దేశం దివాళా
ABN , Publish Date - Jan 10 , 2024 | 11:59 PM
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరుతో దేశం ఆర్థికంగా దివాళా తీసిందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకుడు మల్లు నాగార్జునరెడ్డి అన్నారు.
సూర్యాపేట సిటీ, జనవరి 10 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరుతో దేశం ఆర్థికంగా దివాళా తీసిందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకుడు మల్లు నాగార్జునరెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని మల్లు వెంకటరెడ్డిభవనలో నిర్వహించిన సీఐటీయూ, తెలంగాణ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక, కర్షక సంఘాల జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కర్షక, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సూర్యాపేటలో ఈ నెల 19న నిర్వహించే జిల్లా సదస్సును జయప్రదం చేయాలన్నారు. అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన బీజేపీ గత పదేళ్లలో అనుసరించిన విధానాలతో దేశం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుందన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి, రైతులను బలవంతంగా భూముల నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేసిందన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జే వెంకటేష్, జిల్లా అధ్యక్షుడు ఎం రాంబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు, మట్టిపల్లి సైదులు, దండ వెంకటరెడ్డి, ములకలపల్లి రాములు, కొప్పుల రజిత, చెరుకు ఏకలక్ష్మీ, పులుసు సత్యం, కందాల శంకర్ రెడ్డి, వజ్జా శ్రీనివాస్, కోటగిరి వెంకట నారాయణ, బుర్ర శ్రీనివాస్, వట్టెపు సైదులు పాల్గొన్నారు.