ఉమామహేశ్వర ప్రాజెక్టు డిజైన్ మార్చాలి
ABN , Publish Date - Dec 26 , 2024 | 10:59 PM
ఉమామహేశ్వర ప్రాజెక్టు డిజైన్‌ను మార్చి రైతులకు తమ వ్యవసాయ పొలాలను కోల్పో కుండా చూడాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు డిమాండ్ చేశారు.
- సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు
- ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులకు భూమే ఇవ్వాలి
బల్మూరు, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి) : ఉమామహేశ్వర ప్రాజెక్టు డిజైన్‌ను మార్చి రైతులకు తమ వ్యవసాయ పొలాలను కోల్పో కుండా చూడాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు డిమాండ్ చేశారు. గురువా రం మండల కార్యదర్శి శంకర్‌నాయక్ అధ్యక్ష తన ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించా రు. పర్వతాలు మాట్లాడుతూ రిజర్వాయర్ నిర్మాణం చేపడితే ఇక్కడి రైతులకు ప్రత్యామ్నా యంగా భూములు చూపించాలని కోరారు. మైలారం శివారులోని రామగిరి అడవి భూమి చాలా ఉందని, ఆ భూమిని రిజర్వాయర్లుగా మార్చుకుంటే రైతులకు నష్టం ఉడందని ఆయన తెలిపారు. రైతుల అభిప్రాయాలను ఎమ్మెల్యే పరిగణనలోకి తీసుకోవాలని ఎమ్మెల్యే ను కోరారు. ఉమామహేశ్వర రిజర్వాయర్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీల భూములు అత్యధికంగా కో ల్పోవాల్సి వస్తున్నదని తెలిపారు. భూములు కోల్పోతున్న రైతుల పక్షాన సీపీఎం ఆధ్వర్యం లో పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు దేశ్యనా యక్, నాయకులు ఎండి.లాల్‌మహ్మద్, ఆంజ నేయులు, బాలు, మహేందర్ పాల్గొన్నారు.