Share News

‘లిఫ్ట్‌’ పనులు ఏడాదిలోగా పూర్తి చేయాలి

ABN , Publish Date - Dec 03 , 2024 | 12:34 AM

మండలంలోని కొండ్రపో ల్‌- కేశవాపురం లిఫ్ట్‌ ఇరిగేషన ప్రాజెక్టు ప నులను సంవత్సరంలోపు పూర్తి చేయాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు.

‘లిఫ్ట్‌’ పనులు ఏడాదిలోగా పూర్తి చేయాలి
కొండ్రపోల్‌- కేశవాపురం లిఫ్ట్‌ పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

‘లిఫ్ట్‌’ పనులు ఏడాదిలోగా పూర్తి చేయాలి

ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

దామరచర్ల, డిసెంబరు 2 (ఆంధ్రజ్యో తి): మండలంలోని కొండ్రపో ల్‌- కేశవాపురం లిఫ్ట్‌ ఇరిగేషన ప్రాజెక్టు ప నులను సంవత్సరంలోపు పూర్తి చేయాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. లిఫ్టు పనులను ఇరిగేషన అధికారులు, గ్రామస్థులు, రైతులతో కలిసి సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు సంవత్సరాలవుతున్నా కూడా నష్టపోయిన రైతులకు ఎందుకు నష్ట పరిహారం చెల్లించలేదని కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లుల విషయంలో ఏదైనా ఆలస్యమైతే సంబంధిత ఇరిగేషన శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో మాట్లాడతానని, ఎట్టి పరిస్థితుల్లో పనులు ఆపకూడదని అన్నారు. అదేవిధంగా ప్రాజెక్టు ఎంతవరకు పూర్తయింది, ఇంకా ఎంత ఉందనే విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట కాంగ్రెస్‌ నాయకులతో పాటు అధికారులు ఉన్నారు.

Updated Date - Dec 03 , 2024 | 12:34 AM