Share News

నూతన టెండర్‌ విధానాన్ని రద్దు చేయాలి

ABN , Publish Date - Nov 07 , 2024 | 11:59 PM

విద్యుతశాఖలో నూతనంగా అ మలు చేయనున్న గ్లోబల్‌ టెండర్‌ విధానాన్ని రద్దు చేయాలని జిల్లా ఎలకి్ట్రకల్‌ కాంట్రాక్ట్‌ అసోసియేషన నాయకులు డిమాండ్‌ చే శారు.

 నూతన టెండర్‌ విధానాన్ని రద్దు చేయాలి
సర్కిల్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేస్తున్న కాంట్రాక్టర్లు

నూతన టెండర్‌ విధానాన్ని రద్దు చేయాలి

నల్లగొండటౌన, నవంబ రు 7(ఆంధ్రజ్యోతి): విద్యుతశాఖలో నూతనంగా అ మలు చేయనున్న గ్లోబల్‌ టెండర్‌ విధానాన్ని రద్దు చేయాలని జిల్లా ఎలకి్ట్రకల్‌ కాంట్రాక్ట్‌ అసోసియేషన నాయకులు డిమాండ్‌ చే శారు. అసోసియేషన ఆ ధ్వర్యంలో గురువారం స ర్కిల్‌ కార్యాలయంలో ఎ దుట నిరసన తెలిపారు. అనంతరం జిల్లాకు వచ్చిన రూరల్‌ సీఈకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విద్యుత సంస్థలో నూతనంగా ప్రవేశపెట్టనున్న గ్లోబల్‌ టెండర్‌ విధానంతో సంస్థను నమ్ముకొని బతుకుతున్న వేలాది కుటుంబా లు రోడ్డున పడే అవకాశాలు ఉన్నాయన్నారు. వెంటనే గ్లోబల్‌ టెండర్‌ను రద్దు చేసి తమ కు న్యాయం చేయాలన్నారు. లేనిచో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించా రు. కార్యక్రమంలో అసోసియేషన నాయకులు, పలువురు కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

Updated Date - Nov 07 , 2024 | 11:59 PM