Share News

పోలీసుల అమరుల త్యాగాలు వెలకట్టలేనివి

ABN , Publish Date - Oct 21 , 2024 | 11:50 PM

పోలీసు అమరుల త్యాగుల వెలకట్టలేనివని, వారి సేవలను గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ తెలిపారు.

పోలీసుల అమరుల త్యాగాలు వెలకట్టలేనివి

కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌, ఎస్పీ

వికారాబాద్‌, అక్టోబర్‌ 21: పోలీసు అమరుల త్యాగుల వెలకట్టలేనివని, వారి సేవలను గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ తెలిపారు. సోమవారం పోలీసు అమర వీరుల సంస్మరణ దినం సందర్భంగా పోలీస్‌ పరేడ్‌గ్రౌండ్‌లో స్మృతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌, ఎస్పీ అమరుల స్థూపానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పోలీసు వ్యవస్థ ప్రజల ప్రశాంతత కోసం, తమ ప్రశాంతతను కొల్పోయి కూడా సేవలందిస్తున్నందుకు గర్వించాలన్నారు. దేశంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నప్పుడే ప్రజలు సుఖ శాంతులతో సంతోషంగా ఉంటారన్నారు. పోలీసు అమరుల త్యాగాన్ని స్మరిస్తూ నివాళులు, వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఎస్పీ నారాయణరెడ్డి మాట్లాడుతూ. జిల్లాలో పది రోజుల పాటుగా పోలీస్‌ స్టేషన్లలో వివిధ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. దేశంలో ప్రజల సంరక్షణకు ఏడాది కాలంగా 214 మంది పోలీసులు తమ ప్రాణాలను కోల్పోవడం జరిగిందన్నారు. శాంతి భద్రతలను కాపాడుకుంటూ అభివృద్ధి పథంలో దూసుకువెళ్తున్నామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ లింగ్యానాయక్‌, సుధీర్‌, ట్రైనీ కలెక్టర్‌ ఉమా హారతి, జిల్లా అదనపు ఎస్సీలు రవీందర్‌ రెడ్డి, మురళీధర్‌, జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులలు పాల్గొన్నారు.

Updated Date - Oct 21 , 2024 | 11:50 PM