Share News

Manchiryāla- సైనికులు త్యాగాలు మరువలేనివి

ABN , Publish Date - Jul 26 , 2024 | 10:45 PM

దేశ రక్షణే ఊపిరిగా తమప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న సైనికులు చేస్తున్న త్యాగం మరువలేనివని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. కార్గిల్‌ విజయ్‌దివస్‌ను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరాస్తలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ప్రకాష్‌, సీఐ బన్సీలాల్‌లతో కలిసి పాల్గొన్నారు.

Manchiryāla-      సైనికులు త్యాగాలు మరువలేనివి
కార్గిల్‌ వీరులకు నివాళులు అర్పిస్తున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

ఏసీసీ, జూలై 26 : దేశ రక్షణే ఊపిరిగా తమప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న సైనికులు చేస్తున్న త్యాగం మరువలేనివని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. కార్గిల్‌ విజయ్‌దివస్‌ను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరాస్తలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ప్రకాష్‌, సీఐ బన్సీలాల్‌లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్గిల్‌ వీరులకు నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ అక్రమంగా దేశంలోకి చొరబడిన వారితో ఆర్మీ అధికారులు సైనికులు వీరోచితంగా పోరాడి ప్రాణత్యాగం చేశారన్నారు. కార్గిల్‌ ఘటన ప్రతి భారతీయునిలో చెరగనిముద్ర వేసిందన్నారు. కార్గిల్‌ భూబాగంలోకి 1999 మే నెలలో ఉగ్రవాదులు చొరబడగా దాదాపు రెండున్నర నెలల పాటు అలుపెరుగని పోరాటం చేసి జులై 26, 1999న కార్గిల్‌విముక్తి కల్పించారన్నారు. ఈ పోరాటంలో ఎందరో ఆర్మీ అధికారులు, సైనికులు దేశం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యజించారన్నారు. వారి త్యాగాలు చిరస్మరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మంచిర్యాల అర్బన్‌: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో గల ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సోసైటీ రక్తనిధి కేంద్రంలో శుక్రవారం కార్గిల్‌ విజయ దివస్‌ శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్గిల్‌ యుద్ధంలో అమరులైన 527 మంది భారత సైనికులకు నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా జనరల్‌ సెక్రెటరీ చందూరి మహేందర్‌, కోశాధికారి కె సత్యపాల్‌రెడ్డి, కమిటీ సభ్యులు పవన్‌కుమార్‌ తివారి, కటుకం హరీష్‌, రక్తనిధి కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.

మంచిర్యాల కలెక్టరేట్‌ : కార్గిల్‌ యుద్దంలో వీరమరణం పొందిన సైనికుల త్యాగాలు చిరస్మరణీయమని మహాత్మాజ్యోతిబాపూలే పాఠశాల ప్రిన్సిపాల్‌ రజిత, ఏటీపీ అపర్ణశీల అన్నారు. కార్గిల్‌ వీరుల త్యాగాలను స్మరిస్తూ శుక్రవారం హైటెక్‌సిటీలోని పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు వారికి నివాళులర్పించారు. జెండాతో ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Jul 26 , 2024 | 10:45 PM