Share News

కొమిరెడ్డి దంపతుల సేవలు మరువలేం

ABN , Publish Date - Nov 21 , 2024 | 12:45 AM

నియోజకవర్గం, కాంగ్రెస్‌ పార్టీ అభివృద్ధికి మాజీ ఎమ్మెల్యేలు కొమిరెడ్డి రాములు, జ్యోతి దేవిల సేవలు మరువలేమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవ హారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.

కొమిరెడ్డి దంపతుల సేవలు మరువలేం

- రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు

మెట్‌పల్లి రూరల్‌, నవంబర్‌, 20 (ఆంధ్రజ్యోతి) : నియోజకవర్గం, కాంగ్రెస్‌ పార్టీ అభివృద్ధికి మాజీ ఎమ్మెల్యేలు కొమిరెడ్డి రాములు, జ్యోతి దేవిల సేవలు మరువలేమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవ హారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. బుధవారం మండలంలో ని వెల్లుల్ల గ్రామ శివారులోని వీఆర్‌ఎమ్‌ గార్డెన్‌లో మాజీ ఎమ్మెల్యే కొ మిరెడ్డి జ్యోతిదేవి దశదిన కార్యక్రమానికి ప్రభుత్వ విప్‌, ధర్మపురి ఎమ్మె ల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటం వద్ద నివాళులర్పించారు. కుటుంబ సభ్యులు, కుమారులు కొమిరెడ్డి కరంచంద్‌, విజయ్‌అజాద్‌, కపిల్‌లను పరామర్శించారు. ఈ సందర్భంగా కొమిరెడ్డి దంపతులు చేసిన సహా య సహకారాలు మరవలేనివన్నారు. నియోజక వర్గంలోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా పరిష్కరించేందుకు ఎంత దూరమైన వెళ్లేవారని కొనియాడారు. రాజసభ్యుడు సురేష్‌రెడ్డి, హైకోర్టు న్యాయ మూర్తి ఈవీ వేణుగోపాల్‌, జిల్లా న్యాయమూర్తి నీలిమ, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్‌, మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావులు పాల్గొని ఆమె చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతఫం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, కొమిరెడ్డి అభిమానులు, ప్రజలు, పాల్గొన్నారు.

Updated Date - Nov 21 , 2024 | 12:45 AM