Share News

దేశ రక్షణలో సైనికుల సేవలు అజరామరం

ABN , Publish Date - Jul 27 , 2024 | 12:04 AM

దేశ రక్షణ, ప్రజల రక్షణ కోసం వీరమరణం పొందిన సైనికుల సేవలు అజరామరమని సైనిక సంక్షేమశాఖ ఇనచార్జి అధికారి మక్బూల్‌ అహ్మద్‌ అన్నారు.

 దేశ రక్షణలో సైనికుల సేవలు అజరామరం
సమావేశంలో మాట్లాడుతున్న సైనిక సంక్షేమ శాఖ అధికారి మక్బుల్‌ అహ్మద్‌

దేశ రక్షణలో సైనికుల సేవలు అజరామరం

సైనిక సంక్షేమ శాఖ అధికారి మక్బుల్‌ అహ్మద్‌

నల్లగొండ టౌన, జూలై 26: దేశ రక్షణ, ప్రజల రక్షణ కోసం వీరమరణం పొందిన సైనికుల సేవలు అజరామరమని సైనిక సంక్షేమశాఖ ఇనచార్జి అధికారి మక్బూల్‌ అహ్మద్‌ అన్నారు. మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కార్యాలయంలో కార్గిల్‌ దివస్‌ కార్యక్రమా న్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వీర సైనికులకు నివాళులర్పించి మా ట్లాడారు. వీర సైనికుల త్యాగాన్ని గుర్తు చేసుకుని సైనికులను స్ఫూర్తిగా తీసుకుని కలిసిమెలిసి ఉండాలన్నారు. కార్గిల్‌ యుద్ధంలో మృతి చెందిన వారి కుటుంబసభ్యులను సన్మానించారు. అనంతరం మెమెంటోలు అందజేశారు. మాజీ సైనికుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సంది పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లోజు వెంకటాచారి, నాయకులు సత్యనారాయణరెడ్డి, శ్రీనివా్‌సరెడ్డి, ఇంద్రయ్య, షకీల్‌, లింగాచారి, రాములు, మా రయ్య, కార్యాలయ సిబ్బంది అంజాద్‌షరీఫ్‌, నర్సింహస్వామి, హసీం, శ్రీనివాస్‌, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

దేవరకొండ: సైనికులు దేశ రక్షణ కోసం నిరంతరం అప్రమత్తంగా ఉండారని, దేశ రక్షణ కోసం వారు చేస్తున్న కృషి అభినందనీయమని దేవరకొండ స్పోర్ట్స్‌ అసోసియేషన అధ్యక్షుడు ఎనవీటీ అన్నారు. దేవరకొండలో స్పోర్ట్స్‌ అసోసియేషన ఆధ్వర్యంలో కార్గిల్‌ విజయ్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్మీ రిటైర్డ్‌ ఉద్యోగి జక్కుల శ్రీనయ్యను సన్మానించి మాట్లాడారు. దేశ సరిహద్దుల్లో ఎండకు ఎండుతూ, చలికి వణుకుతూ, వర్షానికి తడు స్తూ దేశ ప్రజల కోసం పోరాడుతూ విధులు నిర్వహిస్తున్న భారత సైనికులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌బీఐ దేవరకొండ చీఫ్‌ మేనేజర్‌ ఫణిందర్‌, స్పోర్ట్స్‌ అసోసియేషన సభ్యులు కృష్ణకిషోర్‌, భాస్కర్‌రెడ్డి, ఉమ మహేశ్వర్‌, వెంకటేష్‌, గోపాల్‌, రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 27 , 2024 | 12:04 AM