Share News

మూసీ ప్రక్షాళనతోనే ప్రజలకు మనుగడ

ABN , Publish Date - Nov 24 , 2024 | 12:37 AM

మూసీ నది ప్రక్షాళన జరిగితేనే నదీ పరివాహక ప్రాం తాల్లో మానవమనుగడ సాధ్యమవుతుంద ని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు.

 మూసీ ప్రక్షాళనతోనే ప్రజలకు మనుగడ
మూసీ రిజర్వాయర్‌లో చేప పిల్లలు వదులుతున్న ఎమ్మెల్యే వేముల వీరేశం

మూసీ ప్రక్షాళనతోనే ప్రజలకు మనుగడ

ఎమ్మెల్యే వేముల వీరేశం

కేతేపల్లి, నకిరేకల్‌, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): మూసీ నది ప్రక్షాళన జరిగితేనే నదీ పరివాహక ప్రాం తాల్లో మానవమనుగడ సాధ్యమవుతుంద ని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. జిల్లా లో నాగార్జునసాగర్‌ త ర్వాత రెండో పెద్ద ప్రాజెక్టు అయిన మూసీలో దాదాపు 9 లక్షల ఉచిత చేప పిల్లలను ఆయన శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చేపల మీద ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న చేపపిల్లలు వరంలాంటిద ని అన్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో మత్స్యకారులు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. మత్స్యకారులకు ఆర్థికంగా లబ్ధి చేకూర్చేందుకు ప్రభు త్వం మూడు రకాల చేప పిల్లలను అందించిందని అన్నారు. గతంలో దోసిలితో తాగిన చరిత్ర గల మూసీ నీళ్లు ప్రస్తుతం విషతుల్యమై పోయాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మూ సీ ప్రాంత ప్రజల జీవన విధానంలో మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. మూసీ నీటిలో ఉన్న సూపర్‌ బగ్‌ బ్యాక్టీరియా పరివాహక ప్రాంత ప్రజల మనుగడను ప్రశ్నార్థకం చేస్తుందన్నారు. మూసీ ప్రక్షాళనతో నీటిలో ఉన్న సూ పర్‌ బగ్‌ బాక్టీరియా నశించి ప్రజల జీవనశైలి మెరుగుపడుతుందన్నారు. కార్యక్రమంలో కాసనగోడు, ఇనుపాముల మాజీ ఎంపీటీసీలు కందుల మోహన్‌, పి.ఇందిర, బి.సుందర్‌, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ ఎస్‌.కేశయ్య, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు కె.శ్రీనివాసయాదవ్‌, నాయకులు ఎం. వెంకట్రాంరెడ్డి, శెట్టి మణి, డి.రాములు, వెంకన్న, కీర్తి వెంకన్న, వెంకటేశ్వర్‌రావు, వెంకటనారాయణ, వెంకటస్వామి, సాదుల నరసయ్య, కొరివి యాదగిరి, లక్ష్మీనారాయణ, యాదగిరి, సైదులు, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 24 , 2024 | 12:37 AM