త్రీఫేజ్ విద్యుత 12 గంటల సరఫరా చాలు
ABN , Publish Date - Jan 20 , 2024 | 12:15 AM
త్రీఫేజ్ విద్యుత్ 12 గంటలు చాలంటూ సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జాన్‌పహాడ్ గ్రామానికి చెందిన పలువురు వినతిపత్రం అందజేసినట్లు ట్రాన్సకో డీఈ వెంకటకృష్ణ తెలిపారు.
పాలకవీడు, జనవరి 19:త్రీఫేజ్ విద్యుత్ 12 గంటలు చాలంటూ సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జాన్‌పహాడ్ గ్రామానికి చెందిన పలువురు వినతిపత్రం అందజేసినట్లు ట్రాన్సకో డీఈ వెంకటకృష్ణ తెలిపారు. పాలకవీడు మండలంలో ప్రజలు, రైతుల అభిప్రాయాలు ఆయన శుక్రవారం సేకరించారు. జాన్‌పహాడ్ గ్రామానికి చెందిన కొందరు రైతులు డైరక్టర్ ఆఫ్ ఆపరేషన్ శ్రీనివా్‌సరెడ్డిని కలిసి తమకు 18 గంటల విద్యుత్ వద్దని 12 గంటలు త్రీఫేజ్ విద్యుత్ ఇస్తే చాలని వినతిపత్రం ఇచ్చారన్నారు. శ్రీనివా్‌సరెడ్డి ఆదేశాల మేరకు గ్రామాల్లో విచారణ చేపట్టగా చెర్వుతండా గ్రామానికి చెందిన రైతులు కోతలు లేకుండా ఇప్పుడు ఇస్తున్నట్లు విద్యుత్ ఇవ్వాలని కోరారన్నాడు. జాన్‌పహాడ్, దర్గా, కల్మెటతండా ప్రాంతానికి చెందిన వారు మాత్రం 12 గంటలు చాలన్నారని వివరించారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామన్నారు.