Mahesh Goud: పథకాల అమలుకు పైసలు తీసుకోవద్దు
ABN , Publish Date - Oct 16 , 2024 | 03:49 AM
‘‘సంక్షేమ పథకాల అమలుకు ఎవరివద్దా ఒక్క పైసా కూడా తీసుకోవద్దు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలు అమలు సమయంలో నాయకులు పూర్తిస్థాయిలో అండగా ఉండి పని చేయాలి. పార్టీ నాయకులు అక్రమాలకు పాల్పడ్డట్లుగా రుజువైతే కఠినంగా చర్యలుంటాయి’’ అని టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్ స్పష్టం చేశారు.
నేతలు అక్రమాలకు పాల్పడితే చర్యలు: మహేశ్ గౌడ్
హైదరాబాద్, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): ‘‘సంక్షేమ పథకాల అమలుకు ఎవరివద్దా ఒక్క పైసా కూడా తీసుకోవద్దు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలు అమలు సమయంలో నాయకులు పూర్తిస్థాయిలో అండగా ఉండి పని చేయాలి. పార్టీ నాయకులు అక్రమాలకు పాల్పడ్డట్లుగా రుజువైతే కఠినంగా చర్యలుంటాయి’’ అని టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్ స్పష్టం చేశారు. గాంధీభవన్‌లో మంగళవారం ఆయన ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్ జిల్లాల పార్టీ నేతలు, ఇన్‌చార్జి మంత్రులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. జిల్లాల్లో పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధత తదితర అంశాలపైన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రె్‌సకు చాలా కీలకమని, వాటిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని క్రమశిక్షణతో పనిచేయాలని, మంచి ఫలితాలు రాబట్టాల న్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ మాట్లాడుతూ.. మెదక్‌లో కేసీఆర్, హరీశ్ రావు వంటి బీఆర్‌ఎస్ అగ్ర నేతలు ఉన్నారని, అక్కడి కాంగ్రెస్ నేతలు చాలా కష్టపడి పనిచేయాలన్నారు.