Home » Mahesh Kumar Goud
Telangana: ఫార్ములా ఈకార్ రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదు అవడంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. చట్టపరంగా కేసు నమోదు అయినందున దీనిపై అసెంబ్లీలో కాదు, కోర్టులో తేల్చుకోవాలని సలహా ఇచ్చారు.
స్వాతంత్య్ర పోరాటం చేస్తుంటే బీజేపీ నేతలు బ్రిటిష్ వారికి తాబేదార్లుగా పని చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. అమిత్ షా వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించాలని అన్నారు.
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బుధవారం కాంగ్రెస్ నేతలకు తాజ్ దక్కన్ హోటల్లో విందు ఇస్తున్నారు. ఆయన టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టి 100 రోజులు దాటిన సందర్భంగా డిన్నర్ పార్టీ ఇస్తున్నారు.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం వెనుకబడిందని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. ఇప్పటికైనా ఆ పార్టీ నేతలు.. అవాకులు చెవాకులు మాని ప్రభుత్వానికి సహకరించాలని హితవు పలికారు.
గతేడాది అంటే 2023 చివరిలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో తెలంగాణ ఓటరు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాడు. దీంతో రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొలువు తీరింది.
కాంగ్రెస్ సర్కారు పాలనలో తెలంగాణ పునర్వికాసం వైపు పయనిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ వ్యాఖ్యానించారు. ప్రజల ఆశీర్వాదాలతో రాష్ట్రాన్ని మరింత ప్రగతి పథంలోకి నడిపిస్తామన్నారు.
ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సోమవారం సచివాలయంలో తలపెట్టిన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలంటూ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ పదేళ్ల విధ్వంస పాలనలో అస్తవ్యస్తంగా మారిన తెలంగాణను కాంగ్రెస్ సర్కారు సరిచేస్తూ వికాసం వైపు పరుగులు తీయిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు.
సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని, ఆమె లేనిదే ప్రత్యేక రాష్ట్రం లేదని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహే్‌షకుమార్ గౌడ్ అన్నారు. డిసెంబరు 9న సోనియా జన్మదినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సెక్రటేరియేట్ లో తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టలేదని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ ప్రశ్నించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి రేవంత్ రెడ్డి గౌరవం ఇస్తూ విగ్రహాన్ని పెట్టిస్తున్నారని షబ్బీర్ అలీ తెలిపారు.