Share News

Hyderabad: హైదరబాదీలకు అలర్ట్.. అటుగా వెళ్తున్నారా, అయితే రూట్ మార్చుకోండి!

ABN , Publish Date - Jan 24 , 2024 | 06:13 PM

హైదరాబాద్ నగరంలోని వాహనదారులకు అలర్ట్. ఎవరైతే గురువారం (25/01/24) నాడు ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ప్రయాణం చేయాలని అనుకున్నారో, వాళ్లు తమ రూట్‌ని మార్చుకోక తప్పదు. ఎందుకంటే.. అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయి.

Hyderabad: హైదరబాదీలకు అలర్ట్.. అటుగా వెళ్తున్నారా, అయితే రూట్ మార్చుకోండి!

హైదరాబాద్ నగరంలోని వాహనదారులకు అలర్ట్. ఎవరైతే గురువారం (25/01/24) నాడు ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ప్రయాణం చేయాలని అనుకున్నారో, వాళ్లు తమ రూట్‌ని మార్చుకోక తప్పదు. ఎందుకంటే.. అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయి. ఇందుకు కారణం.. ఎల్బీ స్టేడియంలో టీపీసీసీ సమావేశం నిర్వహించడమే! అందుకే.. తాము సూచించిన మార్గాల్లోనే వెళ్లాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో వచ్చే వాహనదారులు.. ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంపిక చేసుకోవడం ఉత్తమమని అధికారులు పేర్కొంటున్నారు.


ఇదిలావుండగా.. ఈ సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరు కానున్నారు. గురువారం ఆయన హైదరాబాద్‌కి చేరుకొని, నేరుగా ఈ కార్యక్రమానికి రానున్నారు. ఈ సమావేశంలో భాగంగా ఆయన బూతు స్థాయి ఏజెంట్లతో భేటీ కానున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు.. ఈ సమావేశం ఏర్పాట్లపై ఇప్పటికే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్‌తో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ కార్యక్రమ ఏర్పాట్ల తీరుని పరిశీలించిన ఆయన.. పలు సూచనలు ఇచ్చినట్లు తెలిసింది. అలాగే.. ఈ సమావేశానికి పోలింగ్ బూత్ స్థాయి ఏజెంట్స్ అందరూ తప్పకుండా హాజరు కావాలని సీఎం పిలుపునిచ్చారు.

Updated Date - Jan 24 , 2024 | 06:13 PM