Share News

TS TET: టీఎస్ టెట్ అప్లికేషన్ తేదీ పొడగింపు

ABN , Publish Date - Apr 10 , 2024 | 02:04 PM

కారణాలు ఏమైనప్పటికీ టీఎస్‌ టెట్-2024కు (TSTET-2024) దరఖాస్తు చేయలేకపోయినవారికి తెలంగాణ విద్యాశాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. టెట్ అప్లికేషన్ దరఖాస్తు సమర్పణ గడువును ఏప్రిల్ 20 వరకు పొడగిస్తున్నట్టు ప్రకటించింది.

TS TET: టీఎస్ టెట్ అప్లికేషన్ తేదీ పొడగింపు

హైదరాబాద్: కారణాలు ఏమైనప్పటికీ టీఎస్‌ టెట్-2024కు (TSTET-2024) దరఖాస్తు చేయలేకపోయినవారికి తెలంగాణ విద్యాశాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. టెట్ అప్లికేషన్ దరఖాస్తు సమర్పణ గడువును ఏప్రిల్ 20 వరకు పొడగిస్తున్నట్టు ప్రకటించింది. ఏప్రిల్ 11 నుంచి 20 వరకు అభ్యర్థులకు ఎడిట్ అప్షన్ ఇస్తున్నట్టుగా పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ సర్క్యూలర్ జారీ చేశారు.


కాగా మార్చి 22న ప్రకటించిన నోటిఫికేషన్ ప్రకారం నేటితో (ఏప్రిల్ 10) అప్లికేషన్లకు గడువు ముగియాల్సి ఉంది. మార్చి 27న మొదలైన అప్లికేషన్లు బుధవారంతో ముగియాల్సి ఉంది. చివరి రోజున అప్లికేషన్లు కూడా ఎక్కువగా రావొచ్చని అంచనాలు వేశారు. అభ్యర్థి తాకిడి ఎక్కువగా ఉండొచ్చని భావించారు. అయితే గడువు పొడగిస్తున్నట్టు తెలంగాణ విద్యాశాఖ ప్రకటించడంతో ఇప్పటికే ఆలస్యమైన అభ్యర్థులు ఊపిరిపీల్చుకున్నారు. అభ్యర్థులు https://schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా షెడ్యూల్ ప్రకారం మే 20 నుంచి జూన్‌ 3 వరకు టెట్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఫలితాలు జూన్‌ 12న వెలువడనున్నాయి.

Untitled-12.jpg

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 10 , 2024 | 02:12 PM