Share News

Congress: యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తూర్పు జయారెడ్డి నియామకం

ABN , Publish Date - Jun 13 , 2024 | 03:03 AM

టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి కుమార్తె, యూత్‌ కాంగ్రెస్‌ నేత తూర్పు జయారెడ్డి.. యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం యూత్‌ కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Congress: యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తూర్పు జయారెడ్డి నియామకం

  • ఉత్తర్వులు జారీ చేసిన యూత్‌ కాంగ్రెస్‌

హైదరాబాద్‌, జూన్‌ 12(ఆంధ్రజ్యోతి): టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి కుమార్తె, యూత్‌ కాంగ్రెస్‌ నేత తూర్పు జయారెడ్డి.. యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం యూత్‌ కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. తన తండ్రితో పాటుగా ఎవరి సిఫారసు లేకుండా.. పార్టీకి, యూత్‌ కాంగ్రె్‌సకు తాను అందించిన సేవల ద్వారానే ఆమె నియమితులు కావడం గమనార్హం. 2018 అసెంబ్లీ ఎన్నికలప్పుడు జగ్గారెడ్డి అరెస్టు కాగా.. ఆయన తరఫున సంగారెడ్డి నియోజకవర్గంలో జయారెడ్డి విస్తృతంగా పర్యటించి.. తండ్రి విజయంలో తన వంతు పాత్ర పోషించారు. పార్టీ కార్యకర్తల సంక్షేమం పలు కార్యక్రమాలూ నిర్వహిస్తున్నారు.

కొద్ది సంవత్సరాలుగా ఆమె యూత్‌ కాంగ్రె్‌సలో కార్యదర్శి హోదాలో చురుకుగా పాల్గొంటున్నారు. సంగారెడ్డి జిల్లాలో గ్రామ, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అనేక యూత్‌ కాంగ్రెస్‌ సమావేశాలు నిర్వహించినందుకు, యూత్‌ కాంగ్రెస్‌ ఇచ్చిన కార్యక్రమాలు అమలు చేయడంలో ముందు వరుసలో ఉన్నందున ఆమెను యూత్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి పదవి వరించింది. ఈ సందర్భంగా జయారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలోపేతం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని చెప్పారు.

Updated Date - Jun 13 , 2024 | 03:03 AM