Share News

IMD: తెలంగాణలో మరో రెండ్రోజులు వర్షాలే.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్

ABN , Publish Date - Aug 15 , 2024 | 07:33 PM

తెలంగాణలో మరికొన్నిరోజులు మోస్తరు వర్షాలు(Rains) కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ(IMD) వెల్లడించింది. గురువారం నుంచి ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి తదితర జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

IMD: తెలంగాణలో మరో రెండ్రోజులు వర్షాలే.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్

హైదరాబాద్: తెలంగాణలో మరికొన్నిరోజులు మోస్తరు వర్షాలు(Telangana Rains) కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ(IMD) వెల్లడించింది. గురువారం నుంచి ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సంగారెడ్డి, మెదక్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, మల్కాజ్‌గిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.


ఆగస్టు 16 నుంచి 18 వరకు తెలంగాణలోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వివరించింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని.. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ఇవాళ హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. సాయంత్రం 6 గంటలకే వర్షం ప్రారంభమైంది. వర్షాలధాటికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేశారు.

Updated Date - Aug 15 , 2024 | 07:33 PM