Share News

తెలుగు భాషా వికాసానికి ఎనలేని కృషి

ABN , Publish Date - May 28 , 2024 | 11:13 PM

తెలుగుభాషా వికాసానికి సురవరం ప్రతాప్‌రెడ్డి చేసి న కృషి ఎనలేనిదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ జి.చిన్నారెడ్డి అన్నారు.

తెలుగు భాషా వికాసానికి ఎనలేని కృషి
సురవరం ప్రతాపరెడ్డి విగ్రహానికి నివాళి అర్పిస్తున్న రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్‌ చిన్నారెడ్డి

- సురవరం ప్రపతాప్‌రెడ్డి జయంతిలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్‌ చిన్నారెడ్డి

పాలమూరు/ మహబూబ్‌నగర్‌ టౌన్‌, మే 28 : తెలుగుభాషా వికాసానికి సురవరం ప్రతాప్‌రెడ్డి చేసి న కృషి ఎనలేనిదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ జి.చిన్నారెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేం ద్రంలోని గ్రీన్‌బెల్టు ప్రాతంలో సురవరం ప్రతాప్‌రెడ్డి 128వ జయంతిని పాలమూరు రెడ్డి సేవా సమితి ఆ ధ్వర్యంలో ఘనంగానిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన చెన్నిరెడ్డి మాట్లాడారు. పత్రికా సం పాదకు డిగా, పరిశోధకుడిగా, పండితుడిగా, రచయిత గా, క్రియాశీల ఉద్యమకారుడిగా సాగిన ప్రతాపరెడ్డి ప్రతి భ, కృషి ఎనలేనిదన్నారు. తెలంగాణలో 348 కవుల తో కూడిన గోల్కొండ కవుల సంచిక గ్రంథాన్ని కవుల జీవిత విశేషాలతో ప్రచురించి తెలంగా ణ ఖ్యాతిని చాటిన మహనీ యుడు సురవరం అన్నారు. గోల్కొండ పత్రిక స్థాపించి సంపాదకుడిగా పత్రిక రచయిత గా ప్రసిద్ధి చెందాడన్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలుగు ప్రజలను చైతన్య పరచిన గొప్పకవి సురవ రం అన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ ఎస్‌.స్వర్ణమ్మ, కాం గ్రెస్‌ నాయకులు ఏపీ మిథున్‌రెడ్డి, ప్రముఖ న్యాయ వాది వి.మనోహర్‌రెడ్డి, కట్టా రవికిషన్‌రెడ్డి, నీరజ విఠల్‌రెడ్డి, రావుల అనంత రెడ్డి, పాలమూరు రెడ్డి సేవా సమితి అధ్యక్షుడు టి.ఇంద్రసేనారెడ్డి, వి.రాజేం దర్‌రెడ్డి, యం.నరసింహా రెడ్డి, సభ్యులు, నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు.

సురవరం జీవితం నేటితరానికి తెలియాలి

పాలమూరు : సురవరం ప్రతాప్‌రెడ్డి జీవితం నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని గ్రీన్‌బెల్టు ప్రాంతంలో సురవరం మను మడు కపిల్‌, నివేదితతో కలిసి ప్రతాప్‌రెడ్డి విగ్రహానికి ఆయన పూలమాలవేసి నివాళి అర్పించారు. సురవ రం జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్ర మంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో రైతు సమితి డైరెక్టర్‌ మల్లు నరసింహారెడ్డి, ముడా మాజీ డైరెక్టర్‌ గంజి వెంకన్న, టి.గణేష్‌, అనంతరెడ్డి, పటేల్‌ ప్రవీణ్‌, రామలక్ష్మణ్‌, గిరిధర్‌రెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, శ్రీని వాసరెడ్డి, గోపాల్‌ యాదవ్‌, నవకాంత్‌, కరుణాకర్‌గౌడ్‌, పాల సతీష్‌ పాల్గొన్నారు.

Updated Date - May 28 , 2024 | 11:13 PM