Share News

పాక్‌ జెండాను పోలిన పతాకావిష్కరణ

ABN , Publish Date - Sep 11 , 2024 | 05:23 AM

పాకిస్తాన్‌ జెండాను పోలిన పతాకాన్ని ఆవిష్కరించడం వరంగల్‌లో కలకలం రేపింది. గ్రేటర్‌ వరంగల్‌ 41వ డివిజన్‌ శంభునిపేట జంక్షన్‌లో ఓ వర్గం యువకులు డివైడర్‌ మధ్యలో ఇనుప పైపును ఏర్పాటు చేశారు. శుక్రవారం దానిపై పాక్‌

పాక్‌ జెండాను పోలిన పతాకావిష్కరణ

వరంగల్‌ శంభునిపేట జంక్షన్‌లో కలకలం

శంభునిపేట, సెప్టెంబరు 10: పాకిస్తాన్‌ జెండాను పోలిన పతాకాన్ని ఆవిష్కరించడం వరంగల్‌లో కలకలం రేపింది. గ్రేటర్‌ వరంగల్‌ 41వ డివిజన్‌ శంభునిపేట జంక్షన్‌లో ఓ వర్గం యువకులు డివైడర్‌ మధ్యలో ఇనుప పైపును ఏర్పాటు చేశారు. శుక్రవారం దానిపై పాక్‌ జెండాను పోలిన పతాకాన్ని ఎగురవేశారు. దీనిని గుర్తించిన కొందరు సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. దీంతో అది వైరల్‌గా మారింది. ఈ జెండా పాకిస్తాన్‌ జాతీయ జెండాను పోలి ఉందంటూ స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ విషయం రెండు రోజులుగా చర్చనీయాంశం కాగా మంగళవారం మునిసిపల్‌ సిబ్బంది, పోలీసులు జెండాను తొలగించారు. ఆ సమయంలో కొందరు యువకులు అడ్డుచెప్పగా.. చట్టానికి లోబడి నడుచుకోవాలని అధికారులు హెచ్చరించారు. జంక్షన్‌లో ఉన్న అన్ని జెండాలను తొలగించారు.

Updated Date - Sep 11 , 2024 | 06:35 AM