Share News

రోడ్డుపైనే వాహనాలు

ABN , Publish Date - Dec 21 , 2024 | 01:07 AM

మం డలంలోని గొడుకొండ్ల గ్రామపంచాయతీలోని వెంకటేశ్వరనగర్‌లో రోజు రోజుకు ట్రాఫిక్‌ సమ స్య తీవ్రమవుతోంది.

 రోడ్డుపైనే వాహనాలు
వెంకటేశ్వరనగర్‌ పాత బస్టాండ్‌ సమీపంలో పార్కింగ్‌ చేసిన ద్విచక్ర వాహనాలు, ఆటోలు

రోడ్డుపైనే వాహనాలు

వ్యాపార సముదాయాల వద్ద పార్కింగ్‌ కరువు

మాల్‌లో తీవ్రమవుతున్న ట్రాఫిక్‌ సమస్య

చింతపల్లి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): మం డలంలోని గొడుకొండ్ల గ్రామపంచాయతీలోని వెంకటేశ్వరనగర్‌లో రోజు రోజుకు ట్రాఫిక్‌ సమ స్య తీవ్రమవుతోంది. వివిధ అవసరాల నిమిత్తం ప్రజలు, విద్యార్థులు, యువత వివిధ వర్గాల ప్రజ లు వెంకటేశ్వరనగర్‌(మాల్‌)కు వస్తుండటంతో వాహనాల రద్దీ పెరుగుతోంది. మాల్‌లో షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, ఆసుపత్రులు, హోటళ్లు, ఇతర వ్యా పార సముదాయాలు విపరీతంగా పెరగడంతో పాటు క్రయ విక్రయాలు సైతం పెద్ద ఎత్తున పెరిగాయి. దీంతో వ్యాపార సముదాయాలకు వెళ్లే వినియోగదారులు వాహనాలను పట్టణంలో పార్కింగ్‌ స్థలం లేకపోవడంతో రహదారిపైనే నిలుపుతుండటంతో ట్రాఫిక్‌ సమస్య ఏర్పడుతుం ది. మాల్‌లో ట్రాఫిక్‌ సమస్య ఏర్పడకుండా పోలీ స్‌శాఖ ఇటీవల వ్యాపారులకు అవగాహన కల్పించారు. నిర్వాహకులు కొంతమేరకు నిబంధనలు పాటించినా మంగళవారం చిరు వ్యాపారులు రోడ్డుపైనే ఏర్పాటు చేసుకొని విక్రయిస్తున్నారు.

జిల్లా సరిహద్దు ప్రాంతంలో రద్దీ

నల్లగొండ - రంగారెడ్డి జిల్లా సరిహద్దు ప్రాం తమైన వెంకటేశ్వరనగర్‌ ఎక్స్‌ రోడ్డు సమీపంలో వాహనాలతో పాటు, చిరువ్యాపారులు రోడ్డుపైనే నిర్వహిస్తుడటంతో కొంతమేరకు ట్రాఫిక్‌ సమ స్య ఏర్పడుతోంది. రంగారెడ్డి, నల్లగొండ జిల్లా పోలీసులకు ఇబ్బందిగా మారుతుంది. చింతప ల్లి, యాచారం, మర్రిగూడ, నాంపల్లి మండలాల నుంచి ప్రజలు, విద్యార్థులు తమ అవసరాల నిమిత్తం పట్టణానికి వస్తున్నారు.

పార్కింగ్‌ స్థలం ఏర్పాటు చేయాలి

పట్టణంలో వినియోగదారుల కోసం షాపింగ్‌ దుకాణాల వద్ద పా ర్కింగ్‌ స్థలం లేకపోవడంతో రోడ్డుపైనే వాహనాలు నిలుపుతున్నారు. అధికారులు చొ రవ తీసుకొని పార్కింగ్‌ స్థలం ఏర్పాటు చేయాలి.

లక్ష్మణ్‌ సాగర్‌, వెంకటేశ్వరనగర్‌

నిబంధనలు పాటించాలి

రోడ్డుపైనే వ్యాపారాలు సాగించడం వల్ల ట్రాఫిక్‌ సమస్య ఏర్పడుతుంది. వాహనాలను పార్కింగ్‌ ప్రాంతంలోనే నిలుపుకోవాలి. వ్యాపారస్తులు నిబంధనలు పాటిస్తే పట్టణంలో ట్రాఫిక్‌కు చెక్‌పెట్టే అవకాశం ఉంటుంది. లేనిచో జరిమానా విధించేందుకు తగిన చర్యలు తీసుకుంటాం.

యాదయ్య, ఎస్‌ఐ, చింతపల్లి

Updated Date - Dec 21 , 2024 | 01:07 AM