Share News

Shyam Benegal: చిత్ర పరిశ్రమలో విషాదం.. శ్యామ్ బెనగల్ ఇక లేరు

ABN , Publish Date - Dec 23 , 2024 | 08:20 PM

ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ మరణించారు. ఆయన వయస్సు 90 సంవత్సరాలు. గత కొంత కాలంగా ఆయన వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్నారు.

Shyam Benegal: చిత్ర పరిశ్రమలో విషాదం.. శ్యామ్ బెనగల్ ఇక లేరు

ముంబయి, డిసెంబర్ 23: ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ కన్నుమూశారు. ఆయన వయస్సు 90 సంవత్సరాలు. గత కొంత కాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ముంబయిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. సోమవారం మృతి చెందారు. శ్యామ్ బెనగల్ మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఈ రోజు సాయంత్రం 6.30 గంటలకు శ్యామ్ బెనగల్ మృతి చెందినట్లు ఆయన కుమార్తె పై బెనగల్ వెల్లడించారు.

Also Read: ఎన్ని కష్టాలున్నా.. రాష్ట్రాన్ని బాగు చేయాలన్న లక్ష్యాన్ని మాత్రం విడిచి పెట్టను

Also Read : విశాఖ వాసులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి

Also Read: సినిమా ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్లదు.. పుష్పా నిర్మాతతో కలిసి కోమటిరెడ్డి క్లారిటీ


శ్యామ్ బెనగల్ దర్శకత్వంలో తెరకెక్కిన అనేక చిత్రాలకు అవార్డులు దక్కాయి. మమ్మో (1994) సర్దారీ బేగం (1996), జుబేదా (2001) తదితర చిత్రాలు ఆయన్ని చిత్ర సీమలో అగ్రభాగాన నిలిపాయి. అలాగే అంకూరు, నిషాంత్, మంథన్, భూమిక, జనూన్, మండి తదితర చిత్రాలు సైతం సంచలనం సృష్టించాయి.

Also Read: Yearender 2024: ఢిల్లీ మద్యం కుంభకోణం.. రాజకీయ ప్రకంపనలు

Also Read: లుంగీ కట్టుకొని బెడ్ రూమ్ లో కూర్చో..ఎమ్మెల్యే మాధవి ప్రెస్ మీట్

Also Read : రాతి ఉసిరికాయలు తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..?


1934, డిసెంబర్ 14వ తేదీన హైదరాబాద్‌లోని తిరుమలగిరిలో శ్యామ్ బెనగల్ జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన ఎంఏ చదివారు. పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులను సైతం ఆయన అందుకున్నారు. 2003లో ఇందిరాగాంధీ జాతీయ సమైక్యతా పురస్కారాన్ని అందుకున్నారు. దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు సైతం ఆయనను వరించింది. 2013లో ఏఎన్ఆర్ జాతీయ అవార్డును తీసుకున్నారు. మొత్తం ఏడుసార్లు శ్యామ్ బెనగల్ జాతీయ అవార్డు అందుకున్నారు.

Also Read: పుష్ప సినిమాపై సీతక్క హాట్ కామెంట్స్

Also Read : హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఘరానా మోసం..

For Telangana News And Telugu News

Updated Date - Dec 23 , 2024 | 08:33 PM