ప్రభుత్వ వస్త్ర తయారీ కార్మికుల కూలి రేట్లు పెంచాలి
ABN , Publish Date - Dec 27 , 2024 | 12:41 AM
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం అందించే అర్వీఎం, పీసీ వస్త్రాలను తయారుచేసే కార్మికులకు కూలి పెంచి ఇవ్వాలని సీఐటీయూ పవర్‌లూం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ముషం రమేష్, జిల్లా అధ్యక్షుడు కోడంరమణ కోరారు. సిరిసిల్ల పట్టణంలోని మ్యాక్స్ సంఘాల అధ్యక్షుడు యెల్థండి శంకర్‌ను సీఐటీయూ పవర్‌లూం వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నాయకులు కలిసి కూలి పెంచాలం టూ
సిరిసిల్ల రూరల్, డిసెంబరు 26 (అంధ్రజ్యోతి) : సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం అందించే అర్వీఎం, పీసీ వస్త్రాలను తయారుచేసే కార్మికులకు కూలి పెంచి ఇవ్వాలని సీఐటీయూ పవర్‌లూం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ముషం రమేష్, జిల్లా అధ్యక్షుడు కోడంరమణ కోరారు. సిరిసిల్ల పట్టణంలోని మ్యాక్స్ సంఘాల అధ్యక్షుడు యెల్థండి శంకర్‌ను సీఐటీయూ పవర్‌లూం వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నాయకులు కలిసి కూలి పెంచాలం టూ వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల ఉపాధి కల్పనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం టెస్కో ద్వారా మ్యాక్స్ సంఘాలకు ఇచ్చిన అర్డర్ వస్త్రాలకు సంబంధించి పవర్‌లూం వార్పిన్, వైపని కార్మికులకు 2025 జనవరి 1వ తేదీ వరకు కూలి పెంచి నిర్ణయించాలని లేకుంటే ప్రభుత్వం తయారీ చేయిస్తున్న అర్వీఎం వస్త్రాల తయారీ ఉత్పత్తిని బంద్ చేస్తామన్నారు. ప్రభుత్వ అర్వీ ఎం వస్త్రానికి సంబంధించి మర మగ్గాల కార్మికులకు షర్టింగ్ వస్త్రానికి ఒక మీటర్‌కు రూ 3, షూటింగ్ వస్త్రానికి రూ 3.50 పెంచి ఇవ్వాలన్నారు. వార్పిన్ కార్మికులకు ఒక భీము2/60 వెయ్యిమీటర్‌లకు, 2/30 500 మీటర్లకు రూ. 300లు ఇవ్వాలని అలాగే వైపని కార్మికులకు సం బంధించి అర్వీఎం షర్టింగ్, షూటింగ్ భీములకు వెయ్యిపోగులకు రూ. 130 ఇవ్వాలన్నారు. రాబోయే ప్రభుత్వ అర్డర్ వస్త్రాలన్నింటికీ మరమగ్గాలు, వార్పిన్, వైపని కార్మికులకు కూలి నిర్ణయించిన తరువాతనే అర్డర్‌లను తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షు డు నక్కదేవదాస్, వార్పిన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు సిరిమల్లె సత్యం, వైపని యూనియన్ నాయ కులు ఒగ్గు గణేష్, ఎలిగేటి శ్రీనివాస్ పాల్గొన్నారు.