Share News

Projects in Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు జలకళ.. ప్రస్తుత నీటి మట్టాలు ఇవే

ABN , Publish Date - Jul 28 , 2024 | 09:48 AM

వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ రాష్ట్రంలోని ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంటున్నాయి. క్రమ క్రమంగా నీటిమట్టం పెరుగుతోంది.

Projects in Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు జలకళ.. ప్రస్తుత నీటి మట్టాలు ఇవే
TS Projects

హైదరాబాద్: వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ రాష్ట్రంలోని ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంటున్నాయి. క్రమ క్రమంగా నీటిమట్టం పెరుగుతోంది.

కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 940 క్యూసెక్కులుగా ఉండగా.. ప్రస్తుత నీటిమట్టం 1,389 అడుగులు కాగా ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1405.అడుగులుగా ఉంది. టీఎంసీల పరంగా చూస్తే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 17.802 టీఎంసీలు, ప్రస్తుతం 3.663 టీఎంసీలుగా ఉంది.


ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం వద్ద తగ్గుముఖం పట్టింది. 52.80 అడుగులకు దగ్గడంతో అధికారులు మూడవ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. ప్రస్తుతం నదిలో 14,15,384 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇన్ ఫ్లో 18 వేల క్యూ సెక్కులుగా ఉంది. నంది పంప్ హౌజ్‌కు 12,600 క్యూసెక్కులు, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ 331క్యూసెక్కుల ఎత్తి పోత కొనసాగుతోంది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ప్రస్తుత నీటి మట్టం 17.4803 టీఎంసీలు, పూర్తి సామర్థ్యం 20.175 టీఎంసీలుగా ఉంది.


ఇక కడెం ప్రాజెక్టు ఇన్ ఫ్లో 5 వేల క్యూసెక్కులుగా ఉంది. కుడి, ఎడమ కాల్వలకు 400 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ప్రస్తుత నీటి మట్టం 694.375 అడుగులు కాగా.. పూర్తిస్థాయి సామర్థ్యం 700 అడుగులుగా ఉంది.

మరోవైపు కొమురం భీం ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తి 2 వేల క్యూ సెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. ఇన్‌ఫ్లో 3300 క్యూ సెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటి మట్టం 237.550 అడుగులుగా ఉండగా పూర్తిస్థాయి సామర్థ్యం 243 అడుగులుగా ఉంది.


పోలవరం వద్ద 13.7 మీటర్లు..

పోలవరం వద్ద గోదావరి నీటి మట్టం 13.7 మీటర్లుగా ఉంది. ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 14.74 లక్షల క్యూసెక్కులుగా ఉంది. రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. దీంతో ఏపీ విపత్తుల సంస్థలోని స్టేట్ కంట్రోల్ రూమ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తోంది. సహాయక చర్యల్లో 6 ఎస్‌డీఆర్ఎఫ్, 3 ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉన్నాయి. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ అన్నారు.

Updated Date - Jul 28 , 2024 | 09:48 AM