Lakshadweep: లక్షద్వీప్ ట్రిప్ ప్లాన్ చేశారా.. ఇలా వెళ్తే ఈజీగా చేరుకోవచ్చు
ABN , Publish Date - Jan 15 , 2024 | 12:59 PM
ప్రధాని మోదీ లక్షద్వీప్(Lakshadweep) పర్యటన తరువాత మాల్దీవులకు(Maldives), భారత్ కు మధ్య చెలరేగిన వివాదం ఏ స్థాయికి వెళ్లిందో మనందరికీ తెలుసు. భారత్ పరిధిలోనే సుందరమైన లక్షద్వీప్ వంటి ద్వీపాలు ఉండగా.. మాల్దీవులకు వెళ్లడమేంటని ప్రశ్నిస్తూ భారతీయులు బాయ్ కాట్ మాల్దీవ్స్(Boycott Maldives) నినాదాన్ని హోరెత్తించారు.
హైదరాబాద్: ప్రధాని మోదీ లక్షద్వీప్(Lakshadweep) పర్యటన తరువాత మాల్దీవులకు(Maldives), భారత్ కు మధ్య చెలరేగిన వివాదం ఏ స్థాయికి వెళ్లిందో మనందరికీ తెలుసు. భారత్ పరిధిలోనే సుందరమైన లక్షద్వీప్ వంటి ద్వీపాలు ఉండగా.. మాల్దీవులకు వెళ్లడమేంటని ప్రశ్నిస్తూ భారతీయులు బాయ్ కాట్ మాల్దీవ్స్(Boycott Maldives) నినాదాన్ని హోరెత్తించారు. ఈ క్రమంలో దేశానికి చెందిని కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్ పై అందరి దృష్టి పడింది. అక్కడికి ఎలా చేరుకోవాలి, లక్షద్వీప్ ప్రత్యేకతలేంటి, ప్రయాణ ఖర్చు తదితర వివరాలన్నీ నెటిజన్లు గూగుల్ లో సర్చ్ చేశారు. మేక్ మైట్రిప్ ప్రకారం.. లక్షద్వీప్ గురించి సర్చింగ్ 3,600 రెట్లు పెరిగింది.
హైదరాబాద్ వాసులు కూడా లక్షద్వీప్ ట్రిప్ వేయాలని అనుకుంటున్నారు. మరి ఆ సుందరమైన దీవిని చేరుకోవడం ఎలా, ఖర్చులేంటి వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్, లక్షద్వీప్ మధ్య ప్రత్యక్ష రవాణా మార్గం లేదు. ఆ ప్రాంతం చుట్టూ సముద్రపు నీటితో ఉంటుంది. అక్కడికి చేరుకోవడానికి వివిధ మార్గాల్లో హైదరాబాద్ నుండి బెంగళూరుకు, తర్వాత కొచ్చికి, చివరకు అగట్టి ద్వీపానికి విమానాల్లో చేరుకోవచ్చు. మరొక విమానం హైదరాబాద్ మీదుగా కొచ్చికి ఆపై అగట్టి ద్వీపానికి కలుపుతుంది.
బస్సులో వెళ్లాలనుకునేవారు భాగ్యనగరం నుంచి మంగళూరు, కొచ్చి వరకు వెళ్లొచ్చు. అక్కడి నుంచి విమానంలో లక్షద్వీప్ వెళ్లాల్సి ఉంటుంది. ట్రైన్ లో వెళ్లేవారు హైదరాబాద్ నుంచి ముంబయికి ఆపై కొచ్చికి వచ్చి.. కొచ్చి నుంచి అగట్టి ద్వీపానికి విమానంలో చేరుకోవాలి. ఇండియన్స్ ఆ దీవిలోకి చేరుకోవడానికి అనుమతి తప్పనిసరి.
అక్కడ నివసిస్తున్న అడవి బిడ్డలను రక్షించడానికి ఈ నిబంధన తీసుకొచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. అనుమతి దరఖాస్తును ePermit పోర్టల్‌లో ప్రాసెస్ చేయవచ్చు. అవసరమైన పత్రాలలో పాస్‌పోర్ట్-పరిమాణ ఫొటోగ్రాఫ్, చెల్లుబాటు అయ్యే ఫొటోకాపీ ఉంటుంది. ID రుజువు (ఆధార్ కార్డ్, ఓటర్ ID, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైనవి), జర్నీ ప్రూఫ్ (విమాన టిక్కెట్లు లేదా పడవ రిజర్వేషన్ వివరాలు) ఎంచుకున్న వసతి నుంచి బుకింగ్ నిర్ధారిస్తారు. MakeMyTrip వెబ్‌సైట్ ప్రకారం, హైదరాబాద్ నివాసి లక్షద్వీప్ చేరుకోవడానికి కనీసం 7 వేల రూపాయలు ఖర్చు చేయాలి.