Share News

14 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాం

ABN , Publish Date - Nov 20 , 2024 | 04:38 AM

రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లను చేపట్టామని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ అన్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా

14 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాం

ఇప్పటికే రూ. 50కోట్లు బోనస్‌ రూపంలో చెల్లించాం

రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌

గజ్వేల్‌, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లను చేపట్టామని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ అన్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 14 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్‌ మనూచౌదరితో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రైతులకు కొనుగోలు కేంద్రాల్లో అన్నిరకాల ఏర్పాట్లు చేశామన్నారు. మొదటిసారిగా రైతులకు బోనస్‌ ఇస్తున్నామని, ఇప్పటికే రూ.50 కోట్లను బోనస్‌ రూపంలో చెల్లించినట్లు పేర్కొన్నారు.

Updated Date - Nov 20 , 2024 | 04:38 AM